ఓర్వకల్లు రాతి ఉద్యానవనం

ఓర్వకల్లు రాతి ఉద్యానవనం కర్నూలు జిల్లా, ఓర్వకల్లు గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి సహజంగా ఏర్పడిన రాతి నిర్మాణాలు.[1][2] ఓర్వకల్లు జిల్లా కేంద్రమయిన కర్నూలు నుండి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు నుండి నంద్యాల వెళ్ళే జాతీయ రహదారి 18 కి చుట్టుపక్కలా వీటిని చూడవచ్చు. ఇక్కడ గాజు పరిశ్రమలో విరివిగా ఉపయోగించే క్వార్ట్జ్, సిలికా లాంటి ముడి పదార్థాలతో సహజ శిలలు ఏర్పడ్డాయి. ఇక్కడ సినిమాలు కూడా చిత్రీకరిస్తుంటారు.[3]

ఓర్వకల్లు రాతి ఉద్యానవనం
ఓర్వకల్లు రాతి ఉద్యానవనం is located in Andhra Pradesh
ఓర్వకల్లు రాతి ఉద్యానవనం
సమీప పట్టణంకర్నూలు, ఆంధ్రప్రదేశ్
అక్షాంశరేఖాంశాలు15°41′30″N 78°09′09″E / 15.691633°N 78.152531°E / 15.691633; 78.152531
నవీకరణN.K.G
తెరుచు సమయం24 గంటలు

సౌకర్యాలు మార్చు

ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రాతి రెస్టారెంట్, బోటింగ్, కేవ్ మ్యూజియం, పిక్నిక్ స్థలాలు, వసతి కోసం హరిత రిసార్టు ఉన్నాయి. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీటిని సందర్శించడానికి అనువైన సమయం.

ఇక్కడ ఉన్న డిస్నీ బర్డ్ వాచింగ్ స్పాట్ లో వివిధ రకాలైన పక్షుల శబ్దాలను, వాటి గమనాన్ని వీక్షించవచ్చు.

సినిమా చిత్రీకరణ మార్చు

ఇక్కడ జయం మనదేరా, టక్కరి దొంగ, సుభాష్ చంద్రబోస్, బాహుబలి లాంటి సినిమాలు చిత్రీకరించారు.

మూలాలు మార్చు

  1. కుమారనాథ్, కె. వి. "A rocky, solid gift from nature". thehindubusinessline.com. ఎన్. రాం. Retrieved 17 October 2016.
  2. "Orvakal Rock Garden, Kurnool". trawell.in. Retrieved 17 October 2016.
  3. "ఓర్వకల్: అబ్బురపరిచే రాతి శిలలు!". telugu.nativeplanet.com. Retrieved 17 October 2016.