ఓల్గా నుంచి గంగకు


ఓల్గా నుంచి గంగకు రాహుల్ సాంకృత్యాయన్ రాసిన హిందీ నవల. ఇందులో మొత్తం 20 కథలున్నాయి. రచయిత క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల కాలం నుంచి క్రీస్తు శకం 1942 వరకు జరిగిన కాలంలో ఇండో యూరోపియన్‌ జాతి మానవ వికాసాన్ని ఆసక్తికరమైన 20 కథలుగా మలిచాడు.[2] ప్రతీ కథలోనూ జీవన పోరాటం ఉంటుంది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, సమసమాజం, ప్రపంచశాంతి వంటి విలువల కోసం ప్రధాన పాత్రలు పరితపిస్తాయి. [3] ఈ నవలను తెలుగులోకి రచయిత్రి చాగంటి తులసి అనువాదం చేసింది.[4]

ఓల్గా నుంచి గంగకు
కృతికర్త: రాహుల్ సాంకృత్యాయన్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: ఆర్య ప్రజలు వోల్గా నుండి వలస వెళ్ళిన చరిత్ర
విభాగం (కళా ప్రక్రియ): చారిత్రాత్మక ఫిక్షన్
ప్రచురణ:
విడుదల: 1943 [1]
ప్రచురణ మాధ్యమం: Print (hardback and paperback)
పేజీలు: 382
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 81-225-0087-0
OCLC: 82212373

విశేషాలు మార్చు

ఈ పుస్తకంలోని మొదటి కథ ‘నిశ’ క్రీ.పూ. 6000 సంవత్సరం నాడు ఓల్గా నదీ తీరంలోని, ఆర్కిటిక్‌ మంచు మైదానాలలో ఒక ఇండోయూరోపియన్‌ కుటుంబం తమ జీవిక కోసం ప్రకృతితో జరిపిన పోరాటాన్ని వర్ణిస్తుంది. ఒక్కొక్క కథ ఒక్కొక్క యుగం నాటి ఆచార వ్యవహారాలను, అలవాట్లను చిత్రిస్తుంది. వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అప్పటి జీవనశైలి, మనుషుల భావాలు, భావోద్వేగాలు, అలవాట్లు చిత్రించడం జరిగింది. దీనికి అతను పరిశోధనలో భాగంగా బౌద్ధ భిక్షువుల జీవనశైలిని అక్షర బద్ధం చేయడానికి దారి కూడా సరిగా లేని కొండల్లో నడుస్తూ, టిబెట్‌, కాశ్మీర్‌, లడఖ్‌, కార్గిల్‌ ప్రాంతాల్లో తిరిగి అక్కడ లభ్యమైన పుస్తకాలను కంచర గాడిదలమీద తరలించుకు వచ్చారట. [2]

మూలాలు మార్చు

  1. "Volgāse Gaṅgā (Book, 1943)". WorldCat.org. Retrieved 2015-01-23.
  2. 2.0 2.1 భూమిక. "ఓల్గా నుంచి గంగకు… ఉమా నూతక్కి | స్త్రీవాద పత్రిక భూమిక" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-04-14.
  3. "ఓల్గా నుంచి గంగకు." Sakshi. 2018-08-06. Retrieved 2021-04-14.
  4. "కథా మధురం-2 (యాష్ ట్రే- చాగంటి తులసి) | నెచ్చెలి" (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-08-09. Retrieved 2021-04-14.

ఇతర లింకులు మార్చు