కంది శ్రీనివాస్ రెడ్డి

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో జన్మించిన కంది శ్రీనివాస్ ..అదే ఆదిలాబాద్ జిల్లాలో తన గ్రాడ్యుయేషన్ను పూర్తి చేసి ఉన్నత విద్యకొరకు విదేశాలకు వెళ్లారు.

విదేశాలలో తన విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత కొంతకాలం అక్కడే ఉద్యోగం చేస్తూ జీవితంలో బలంగా స్థిరపడ్డారు కంది శ్రీనివాస్ .

చిన్నప్పటి నుంచి ఎంతో సేవా, అంకితభావం ఉన్నటువంటి కంది శ్రీనివాస్ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు.

ఆ తర్వాత అతను స్వదేశానికి తిరిగి వచ్చి భారతీయ జనతా పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేసి కొంతకాలం ఆ పార్టీలో కొనసాగారు.

అంతర్గ కారణాలవల్ల ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన కంది శ్రీనివాస్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి ఆయన నియోజకవర్గంలో తన కేడర్ను పెంచుకుంటూ అటు పార్టీ అధిష్టానానికి ఇటు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ వచ్చారు.

శ్రీనివాస్ పనితీరును పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు ఆదిలాబాద్ నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది.

2023 తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో అదిలాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ముందున్నారు కంది శ్రీనివాస్ .

నియోజకవర్గంలో తనదైన సేవ, సామాజిక కార్యక్రమాలతో పాటు ఇతర అనేక హెల్త్ క్యాంప్ లు, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్, వస్తే ఇలాంటివి కల్పించడం అనేటువంటి అంశాలు కంది శ్రీనివాస్ గెలుపుకి ముఖ్యమైన అంశాలుగా చెప్పవచ్చు.


ఆధారం మార్చు

[1]

  1. "సి ఇ ఓ తెలంగాణ అఫిడవిట్". Archived from the original on 2023-11-20.