కథ కంచికి మనం ఇంటికి

కథ కంచికి మనం ఇంటికి 2022లో విడుదలైన తెలుగు సినిమా. యమ్.పి ఆర్ట్స్ బ్యానర్‌పై మోనిష్ పత్తిపాటి నిర్మించిన ఈ సినిమాకు చాణక్య చిన్న దర్శకత్వం వహించాడు. అరుణ్ అదిత్, పూజిత పొన్నాడ, మహేష్ మంజ్రేకర్, వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను అరుణ్ అదిత్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న విడుదల చేసి,[1] సినిమాను డిసెంబర్ 15న విడుదల చేశారు.[2]

కథ కంచికి మనం ఇంటికి
దర్శకత్వంచాణక్య చిన్న
స్క్రీన్ ప్లేచాణక్య చిన్న
నిర్మాతమోనిష్ పత్తిపాటి
తారాగణంఅరుణ్ అదిత్
పూజిత పొన్నాడ
వినోద్ కుమార్
మహేష్ మంజ్రేకర్
ఛాయాగ్రహణంవైయస్ కృష్ణ
సంగీతంభీమ్స్ సిసిరోలియో
నిర్మాణ
సంస్థ
యమ్.పి ఆర్ట్స్
విడుదల తేదీ
2022 ఏప్రిల్ 8
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

ప్రేమ్ (అరుణ్ అదిత్) తన పేరులో తప్ప జీవితంలో ప్రేమ లేదని, పెళ్లి కావడం లేదని ఫీలయ్యే యువకుడు. బెట్టింగ్ అంటే చాలు ఎంత రిస్క్ అయినా టేకప్ చేసే అమ్మాయి అమ్మాయి దీక్ష (పూజితా పొన్నాడ). కన్నయ్య ('గెటప్' శీను) దొంగ. నంది ('మిర్చి' హేమంత్) రైటర్. వేర్వేరు కారణాల చేత ఈ నలుగురూ ఓ రాత్రి స్మశానానికి వెళతారు. భయపడుతూ ఒకరికొకరు పరిచయం అవుతారు. తర్వాత స్మశానం పక్కనున్న బంగ్లాలోకి వెళతారు. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది? ఆమెలోకి ఎవరెవరి ఆత్మలో ప్రవేశిస్తూ ఈ నలుగురినీ ముప్పు తిప్పలు పెడతాయి. అసలు, ఆ అమ్మాయి ఎవరు? ఆమెలో ఆత్మలు ఎవరివి? ఆత్మల పగ ఎవరి మీద? ఆ ఆత్మల నుంచి, బంగ్లా నుంచి ఆ నలుగురూ ఎలా బయటపడ్డారు? అనేది మిగతా సినిమా కథ.[3]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: యమ్.పి ఆర్ట్స్
  • నిర్మాత: మోనిష్ పత్తిపాటి[4]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చాణక్య చిన్న
  • సంగీతం: భీమ్స్ సిసిరోలియో
  • సినిమాటోగ్రఫీ: వైయస్ కృష్ణ
  • మాటలు: శ్రీనివాస్‌ తేజ

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (10 June 2021). "కథ కంచికి మనం ఇంటికి". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
  2. Andhra Jyothy (5 April 2022). "'కథ కంచికి మనం ఇంటికి'.. హాయిగా నవ్వించి పంపిస్తారట!" (in ఇంగ్లీష్). Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
  3. NTV (8 April 2022). "రివ్యూ: కథ కంచికి మనం ఇంటికి". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
  4. Namasthe Telangana (1 April 2021). "కంచికి చేరిన కథ". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.