కపాలేశ్వర దేవాలయం

కపాలీశ్వరుడి కోవెల భారత దేశ తమిళనాడు రాష్ట్ర రాజధానియైనచెన్నై లోని మైలాపూర్ లో కలదు. ఇచ్చటి శివుడి పేరు కపాలీశ్వరుడు (లేక కపాలి మాత్రమే). అమ్మవారి పేరు కర్పకాంబాళ్. మైలాపూర్ అను ప్రాంతము తిరుమయిలై అనియు కపాలీశ్వరము అనియును పిలువబడుచున్నది.ఇచ్చట పార్వతీదేవి నెమలి రూపములో శివుని గూర్చి ఘోర తపంబొనర్చెననియు అందువలన ఈ ప్రాంతమునకు మైలాపూర్ లేక తిరుమయిలై అను పేరు వచ్చెనని ఐతిహ్యము. అరవ భాషయందు "మయిల్" అనిన "నెమలి" అని అర్థము. ఇచ్చట కపాలిశ్వరునకును కర్పగాంబాళ్ అమ్మవారికిని వెవ్వేరు సన్నిధులు గలవు. ఇవియేగాక పరివారమూర్తులైన వినాయకునికిని సుబ్రహ్మణ్యునకును ఇచ్చట ప్రత్యేక సన్నిధులు గలవు. ఈ ఆలయాన్ని తమిళనాడుని 8 వ శాతాబ్దంలో పరిపాలించిన పల్లవులు నిర్మించారని చెబుతారు. ఐయితే ఈ ఆలయం పోర్చుగీసు వారి దండయాత్రల పాలైనట్లు ఆలయ జీర్ణోద్ధారణ జరిగినట్లు కూడా తెలుస్తోంది అయితే సైటేషన్ లేదు.

కపాలేశ్వర స్వామి దేవాలయం

లోకోక్తి మార్చు

అరవ భాషయందు "మైలైయే కైలై---కైలైయే మైలై" అను లోకోక్తియొకటి గలదు. దానియర్థము "మైలాపూరే కైలసము---కైలాసమే మైలాపూరు". ఆలయపు వాయువ్య భాగమందు ఈ ఫలకము (బోర్డు) అమర్చబడినది.