కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయచరిత్ర

కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణశాస్త్రి స్వీయచరిత్రను ప్రముఖ వ్యాకర్త, భాషావేత్త, రచయిత దువ్వూరి వేంకటరమణ శాస్త్రి ఆత్మకథ.

కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయచరిత్ర
పుస్తక ముఖచిత్రం
కృతికర్త: దువ్వూరి వేంకటరమణ శాస్త్రి
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రక్రియ: ఆత్మకథలు
ప్రచురణ:
విడుదల:

రచన నేపథ్యం మార్చు

రచయిత మార్చు

దువ్వూరి వేంకటరమణ శాస్త్రి సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు, కళాప్రపూర్ణ గ్రహీత. వీరిది తూర్పు గోదావరి జిల్లాలో మసకపల్లి గ్రామం. ఈయన విద్యాభ్యాసం తాతగారైన రామచంద్రుడు వద్ద జరిగింది. వీరిరువురూ చదువు ముగిసిన తర్వాత ఎక్కువగా "కట్టు శ్లోకాలు" అనే చిత్రమైన సారస్వత క్రీడా వినోద ప్రక్రియ ఆడేవారు. ఇది నేటి అంత్యాక్షరి లాంటిది. అయితే పాటలతో కాకుండా శ్లోకాలతో ఆడాలి. ఈయన వివాహం పదిహేనేళ్ళ వయసులో కోనసీమలో అమలాపురం తాలూకా ఇందుపల్లి గ్రామంలో జరిగింది. ఈయన మామగారు వంక జగనాధశాస్త్రి. ఈయన 1914 సంవత్సరంలో విజయనగరం సంస్కృత కళాశాలలో విద్యార్థిగా చేరాడు. ఆ కాలంలో గుదిమెళ్ళ వరదాచార్యులు గారు కాలేజీ అధ్యక్షులుగా, కిళాంబి రామానుజాచార్యులు వైస్ ప్రిన్సిపాల్, సంస్కృత భాషా బోధకులు, వజ్ఝల సీతారామస్వామి శాస్త్రులు తెలుగు బోధకులు. ఈయన 1918లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి "విద్వాన్" పరీక్షలో ఉత్తీర్ణులయ్యాడు. వడ్లమాని విశ్వనాథశాస్త్రి, వడ్లమాని లక్ష్మీనరసింహశాస్త్రి, సోమావజ్ఝల సత్యనారాయణశాస్త్రి, గుళ్లపల్లి వేంకటేశ్వరశాస్త్రి నలుగురు వీరి సహాధ్యాయులుగా విద్వాన్ పరీక్షలో సఫలీకృతులయ్యారు.[1]

రచనాంశాలు మార్చు

శైలి-శిల్పం మార్చు

ప్రాధాన్యత మార్చు

ప్రచురణలు మార్చు

ఉదాహరణలు మార్చు

మూలాలు మార్చు

  1. కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయ చరిత్ర, అభినవ ప్రచురణలు, తిరుపతి, 2009.

ఇవి కూడా చూడండి మార్చు