కార్పోరేషన్ పన్ను

కార్పొరేట్ పన్ను చట్టబద్ధమైన సంస్థల ఆదాయం పైన, లేదా మూలధనం పైన ప్రభుత్వం విధించే ప్రత్యక్ష పన్ను.[1] దీన్ని కార్పొరేట్ పన్ను లేదా కంపెనీ పన్ను అని కూడా పిలుస్తారు. చాలా దేశాలు జాతీయ స్థాయిలో ఇటువంటి పన్నులను విధిస్తాయి. రాష్ట్ర లేదా స్థానిక స్థాయిలో కూడా లాంటి పన్ను విధించవచ్చు. ఈ పన్నులను ఆదాయపు పన్ను లేదా మూలధన పన్ను అని కూడా పిలుస్తారు. భాగస్వామ్య సంస్థలపై సాధారణంగా ఎంటిటీ స్థాయిలో పన్ను విధించరు. ఓ దేశంలో విధించే కార్పొరేట్ పన్ను కింది వాటికి వర్తించవచ్చు:

  • ఆ దేశంలో స్థాపించిన సంస్థలు,
  • ఆ దేశం నుండి వచ్చే ఆదాయంపై దేశంలో వ్యాపారం చేస్తున్న సంస్థలు,
  • దేశంలో శాశ్వత స్థాపన కలిగిన విదేశీ సంస్థలు, లేదా
  • పన్ను ప్రయోజనాల కోసం సంస్థలు దేశం తమ నివాసంగా భావించినపుడు.
యునైటెడ్ కింగ్డమ్ కి సంబందించిన పన్ను ముద్ర

పన్నుకు లోబడి ఉండే సంస్థ ఆదాయాన్ని, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల ఆదాయాన్ని నిర్ణయించిచినట్లే నిర్ణయిస్తారు. సాధారణంగా, నికర లాభాలపై పన్ను విధిస్తారు. కొన్ని అధికార పరిదుల్లో, ఈ పన్ను నియమాలు వ్యక్తులపై పన్ను విధించే నిబంధనల కంటే గణనీయంగా భిన్నంగా ఉండవచ్చు. పునర్వ్యవస్థీకరణల వంటి కొన్ని కార్పొరేట్ చర్యలపై పన్ను విధించకపోవచ్చు. కొన్ని రకాల సంస్థలను పన్ను నుండి మినహాయించనూ వచ్చు.

సంస్థల నికర లాభంపై పన్ను విధించవచ్చు. సంస్థ తన వాటాదారులకు డివిడెండ్ చెల్లించినప్పుడు, ఆ వాటాదారులపై కూడా పన్ను విధించవచ్చు. డివిడెండ్లకు పన్ను విధించిన చోట, డివిడెండ్ పంపిణీ చేయడానికి ముందే పన్నును కోసి మిగతా సొమ్మునే చెల్లించే నిబంధన కూడా విధించవచ్చు.

భారత దేశంలో మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో కంపెనీలపై సూపర్ టాక్స్ పేరుతో మొదటి సారిగా పన్ను విధించారు. ఇది వ్యక్తులపై కాకుండా సంస్థలపై, కంపెనీలపై మాత్రమే విధిస్తారు. కంపెనీలు ఆర్జించే నికర ఆదాయంపై ముందుగా కార్పోరేషన్ పన్నును చెల్లించవలసి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే లాభాల కింద వాటాదార్లకు పంచవలసి ఉంటుంది. వాటాదారులు లేదా కంపెనీ యజమానులు వారివారి ఆదాయాలపై ఆదాయపు పన్నును కూడా చెల్లించవలసి ఉంటుంది.

మూలాలు మార్చు

  1. "Countries back global minimum corporate tax of 15%". The Economic Times. Retrieved 2021-07-03.