కాలేజ్ రవి చావలి దర్శకత్వంలో 2000 లో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో శివాజీ, మాన్య, సదానంద్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తరంగ సుబ్రహ్మణ్యం తరంగ ఫిలింస్ పతాకంపై నిర్మించాడు. శశి ప్రీతం సంగీత దర్శకత్వం వహించాడు.[1]

కాలేజ్
దర్శకత్వంరవి చావలి
నిర్మాతతరంగ సుబ్రహ్మణ్యం
ఛాయాగ్రహణంవిజయ్ సి. కుమార్
సంగీతంశశి ప్రీతమ్
నిర్మాణ
సంస్థ
తరంగ ఫిల్మ్స్
విడుదల తేదీ
2000 నవంబరు 20 (2000-11-20)
భాషతెలుగు

కథ మార్చు

ఐదుమంది మిత్రులు కళాశాలలో చదువుకుంటూ ఉంటారు. ఎలాంటి కష్టమొచ్చినా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటారు. వారిలో ఒకడైన సూరికి ఒకరోజు అదే కళాశాలలో చదువుతున్న ఒక అనామక యువతి నుంచి ప్రేమలేఖ వస్తుంది. అది ఎవరు రాశారో తెలుసుకోవాలని ఆ మిత్రులు ఆరాటపడతారు. అందరూ కలిసి ఆమెను కనిపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెడతారు.

ఆమె వారికి కళాశాలలో జరుగుతున్న క్రికెట్ పోటీలకు వస్తే తాను అందులో పాల్గొంటున్నానని చెబుతుంది. దాని తర్వాత వాళ్ళకి కొంతమంది అమ్మాయిల హాస్టల్ రూము నంబరు తెలుస్తుంది. తర్వాత ఆమె దస్తూరి గురించి ఆరా తీయడం మొదలు పెడతారు. హాస్టల్ వార్డెనుకు లంచం ఇచ్చి దొంగతనంగా అమ్మాయిల గదిలో దూరి అక్కడ ఉండే లెటర్ ప్యాడ్ కోసం చూస్తారు. కానీ ఈ లోపలే అమ్మాయిలు తిరిగి గదిలోకి రావడంతో పదో తరగతి సర్టిఫెకెటు జెరాక్స్ కాపీ, బ్రా తీసుకుని పారిపోతారు. కానీ తిరిగి వచ్చాక ఆ సర్టిఫికెట్ లో సగం మాత్రమే కనిపిస్తుంది. అందులో అమ్మాయి పుట్టుమచ్చ గురించి రాసి ఉంటుంది.

ఈ ఆధారాలతో వీరు అనకొండ 000 అనే డిటెక్టివ్ ను కలుసుకొని ఆ అమ్మాయిని కనిపెట్టడానికి సాయం చేయమంటారు. వీరందరూ కలిసి ఆ అమ్మాయిని ఎలా కనిపెట్టారన్నది మిగతా చిత్ర కథాంశం.

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

సంగీతం మార్చు

ఈ చిత్రానికి శశి ప్రీతమ్ సంగీత దర్శకత్వం వహించాడు. నైజాం ప్రాంతంలో బోనాల సందర్భంగా పాడుకునే మాయదారి మైసమ్మో అనే పాట ఈ చిత్రంలో వాడుకున్నారు.

మూలాలు మార్చు

  1. "Telugu Cinema - College Review - Sivaji, Manya and sadanand". www.idlebrain.com. Retrieved 2020-09-02.