కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్

కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[2] ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, శాసనమండలి సభ్యుడిగా పని చేశాడు.[3][4] ఆయన ప్రస్తుతం తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు.[5]

కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్

శాసనమండలి సభ్యుడు
పదవీ కాలం
2007–2011

మన పార్టీ అధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
ఆగష్టు 2007

వ్యక్తిగత వివరాలు

జననం (1954-08-19) 1954 ఆగస్టు 19 (వయసు 69)
బాచుపల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం[1]
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు మన పార్టీ
తెలుగుదేశం పార్టీ (2007 వరకు)
కాంగ్రెస్ పార్టీ (2018 - 2022 అక్టోబర్ 14)
తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు కాసాని రాములు
జీవిత భాగస్వామి కాసాని చంద్రకళ
సంతానం రాజేశ్వరి, మాధవి , శిల్పా, కాసాని సాయి రాజేంద్రప్రసాద్
నివాసం కుత్బుల్లాపూర్

కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[6] కాసాని జ్ఞానేశ్వర్ 2022 అక్టోబర్ 14న హైదరాబాద్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు.[7] ఆయన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా 2022 నవంబర్ 04న నియమితుడయ్యాడు.[8]

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో మనస్థాపంతో చెందిన ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేశాడు.[9][10] ఆయన నవంబర్ 03న మర్కూర్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో  బీఆర్ఎస్‌ పార్టీలో చేరాడు.[11]

నిర్వహించిన పదవులు మార్చు

పదవి కాలం భాద్యత
2001–2006 రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్‌
2007–2011 ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు
2007– ప్రస్తుతం మన పార్టీ అధ్యక్షుడు
1975–1987 ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు
1987–1993 రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
1993 రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి
1999 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు
2005 తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

మూలాలు మార్చు

  1. CEO Telangana (2010). "Kasani Gnaneshwar Affidavit" (PDF). Retrieved 9 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Eenadu (14 March 2024). "సాధారణ కార్యకర్తగా మొదలై రాష్ట్రస్థాయికి". Archived from the original on 14 March 2024. Retrieved 14 March 2024.
  3. "Mana Party launched". The Hindu. 21 August 2007.
  4. "93 BC bodies form party in Andhra". Tribune India. 16 July 2007.
  5. Namasthe Telangana (18 October 2021). "'ముదిరాజ్‌ మహాసభ' @100". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  6. Deccan Chronicle (12 December 2018). "Telangana polls: It was a mixed luck for the wealthiest of the lot" (in ఇంగ్లీష్). Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  7. Andhra Jyothy (14 October 2022). "టీడీపీలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్" (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2022. Retrieved 14 October 2022.
  8. Eenadu (4 November 2022). "తెదేపా తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌". Archived from the original on 4 November 2022. Retrieved 4 November 2022.
  9. Eenadu (30 October 2023). "తెదేపాకు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా". Archived from the original on 30 October 2023. Retrieved 30 October 2023.
  10. Sakshi (30 October 2023). "తెలంగాణ టీడీపీకి కాసాని జ్ఞానేశ్వర్‌ రాజీనామా". Archived from the original on 30 October 2023. Retrieved 30 October 2023.
  11. Andhrajyothy (3 November 2023). "బీఆర్ఎస్‌లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్". Archived from the original on 3 November 2023. Retrieved 3 November 2023.