కిడాంబి రఘునాథ్

కిడాంబి రఘునాథ్ (1944-2003) సౌరశక్తి శాస్త్రవేత్త, పత్రికా సంపాదకులు.

కిడాంబి రఘునాథ్
కిడాంబి రఘునాథ్
జననంజూన్ 4, 1944
వనపర్తి
మరణం2003 అక్టోబరు 25(2003-10-25) (వయసు 59)
జాతీయత Indian
రంగములుసోలార్ ఎనర్జీ ,
వృత్తిసంస్థలుకాన్పూర్ ఐ.ఐ.టి.లో మెటలర్జికల్ ఇంజినీరింగ్
చదువుకున్న సంస్థలువేగేశ్న పద్మావతి హేండీకాప్డ్ సంస్థ
ప్రసిద్ధిసుప్రసిద్ధ సౌరశక్తి శాస్త్రవేత్త , పత్రికా సంపాదకులు.

వీరు జూన్ 4, 1944 సంవత్సరంలో వనపర్తి గ్రామంలో కిడాంబి నరసింహాచార్యులు, అంబుజమ్మ దంపతులకు జన్మించారు. హైదరాబాదులో భౌతిక శాస్త్రంలో ఎం.ఎస్.సి. చేసి తరువాత కాన్పూర్ ఐ.ఐ.టి.లో మెటలర్జికల్ ఇంజినీరింగ్ లో ఎం.టెక్. పూర్తిచేశారు. అమెరికాలో పి.హెచ్.డి.చేసి సోలార్ ఎనర్జీ (సౌరశక్తి) మీద పనిచేసి, భారతదేశంతో పాటు సుమారు 40 దేశాలకు సోలార్ ఎనర్జీ ఎక్విప్ మెంట్ సప్లై చేసి వ్యాపారం చేశారు.

తెలుగు భాష, సాహిత్యం మీదున్న మమకారంతో అమెరికాలో తెలుగు జ్యోతి పత్రికకు లైఫ్ టైమ్ ఎడిటర్ గా నియమితులై ఈ పత్రికను సుమారు 20 సంవత్సరాలు ధారావాహికంగా నడిపారు. హైదరాబాదులోని వేగేశ్న పద్మావతి హేండీకాప్డ్ సంస్థ యొక్క వ్యవస్థాపనకు ఎన్నో విధాలుగా కృషిచేసి చేయూతనిచ్చారు.

ఈయన భార్య ప్రభ రఘురామ్, కూతురు ఉష, అల్లుడు శ్యాం పెరంగూర్ మిగిలిన అభిమానుల్ని శోకసాగరంలో ముంచి 2003 సంవత్సరం అక్టోబర్ 25 తేదీన ఇహలోకాన్ని విడిచారు.