కీసర రెవెన్యూ డివిజను

తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం.

కీసర రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని 2 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం కీసర పట్టణంలో ఉంది.[2] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఇది మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలోని మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

కీసర రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్ మల్కాజ్‌గిరి

వివరాలు మార్చు

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[4]

పరిపాలన మార్చు

కీసర డివిజన్‌లోని మండలాలు:[5]

క్ర.సం కీసర రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 మేడ్చల్ మండలం 27 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు)
2 షామీర్‌పేట్ మండలం 15 రెవెన్యూ గ్రామాలు
3 కీసర మండలం 16 రెవెన్యూ గ్రామాలు
4 కాప్రా మండలం 3 రెవెన్యూ గ్రామాలు
5 ఘట్‌కేసర్ మండలం 19 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
6 మేడిపల్లి మండలం 8 రెవెన్యూ గ్రామాలు
7 ఉప్పల్ మండలం 14 రెవెన్యూ గ్రామాలు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Suryapet district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 11 October 2016. Retrieved 2022-09-12.
  3. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-09-19.
  4. "Revenue Divisions | District Medchal Malkajgiri, Government of Telangana | India". Archived from the original on 2022-01-29. Retrieved 2022-09-19.
  5. "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-09-19. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)