కుడిపూడి చిట్టబ్బాయి

కుడిపూడి చిట్టబ్బాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

కుడిపూడి చిట్టబ్బాయి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004 - 2009
ముందు మెట్ల సత్యనారాయణ రావు
తరువాత పినిపె విశ్వరూప్
నియోజకవర్గం అమలాపురం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1949
తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి అరుణ సత్యసుధామణి
సంతానం 3, Bharath Bhushan, Bala Lakshman, Venu Gopalan, Mallika

రాజకీయ జీవితం మార్చు

కుడిపూడి చిట్టబ్బాయి కాంట్రాక్టర్ గా పనిచేస్తూ మాజీ మంత్రి కుడిపూడి ప్రభాకరరావుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన అమలాపురం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడి స్థాయి నుంచి పిసిసి సభ్యుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మెట్ల సత్యనారాయణ రావు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. కుడిపూడి చిట్టబ్బాయి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైసిపి కేంద్ర కమిటి సభ్యుడిగా పని చేశాడు.

మరణం మార్చు

కుడిపూడి చిట్టబ్బాయి కరోనా సంబంధిత వ్యాధులతో బాధపడుతూ కాకినాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 29 ఏప్రిల్ 2021న మరణించాడు.[1][2]

మూలాలు మార్చు

  1. Sakshi (29 April 2021). "మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి కన్నుమూత". Archived from the original on 24 December 2021. Retrieved 24 December 2021.
  2. Andhrajyothy (29 April 2021). "కుడుపూడి చిట్టబ్బాయి ఇకలేరు". Archived from the original on 24 December 2021. Retrieved 24 December 2021.