కె.ఎ. మునిసురేష్ పిళ్లె

కె.ఎ. మునిసురేష్ పిళ్లె పాత్రికేయుడు, తెలుగు రచయిత. పూర్వ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగారు. ఆదర్శిని పత్రికా సంపాదకులు ఆరంబాకం ఎల్లయ్య, భారతమ్మ వీరి తల్లిదండ్రులు. వృత్తిరీత్యా హైదరాబాదులో స్థిరపడ్డారు. ఆదర్శిని మీడియా సంస్థను నిర్వహిస్తున్నారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా, సినిమా రచయితగా కొనసాగుతున్నారు.

కె.ఎ.మునిసురేష్ పిళ్లె
జననం13 డిసెంబరు 1972
శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్
జీవిత భాగస్వామిఅన్నపూర్ణ
పిల్లలుఆదర్శిని భారతీకృష్ణ ఆదర్శిని శ్రీ
తల్లిదండ్రులుఆరంబాకం ఎల్లయ్య భారతమ్మ
వెబ్‌సైటుhttp://sureshpillai.com/

పాత్రికేయ ప్రస్థానం మార్చు

తన తండ్రి 1970లో స్థాపించిన ఆదర్శిని వారపత్రికలో పనిచేస్తూ వ్యాసాలు, కథలు, కవితలు రాస్తూ చిన్నతనంలోనే పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించారు.

తిరుపతి గోవిందరాజస్వామి కళాశాలలో డిగ్రీ చదువుతుండగా ఉదయం దినపత్రికలో 1991లో ఎన్ఎంఆర్ సబ్ ఎడిటర్ గా ప్రధాన స్రవంతి పత్రికలలో ప్రస్థానం ప్రారంభించారు. 1993లో ఈనాడు దినపత్రికలో చేరారు. 1994 ఈనాడు జర్నలిజం స్కూలులో డిప్లమో చేసిన తర్వాత తిరుపతిలోనే కొనసాగుతూ వచ్చారు. ఈనాడు చిత్తూరు జిల్లా అనుబంధానికి ఇన్చార్జిగా పనిచేశారు. ఈనాడు ఇంటర్నెట్ ఎడిషన్, ఆదివారం అనుబంధం బాధ్యతలు చూశారు. 2006 తర్వాత ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. ఆదర్శిని మీడియా సంస్థను స్థాపించి.. మీడియారంగంలో బహుముఖ సేవలు అందిస్తున్నారు.