కె.బి థియేటర్

కొమురం భీం జిల్లాలో గల ఒక సినిమా హాలు

కె.బి థియేటర్ (కొమురం భీం థియేటర్)[1] అనేది కొమురం భీం జిల్లాలో గల ఒక సినిమా హాలు. దీనిని బెలూన్ థియేటర్ అని కూడా పిలుస్తారు. కొమురం భీం జిల్లాలో ఉన్న అతి కొద్ది సినిమా హాలులో ఇది ఒకటి. ఇది భారతదేశంలోనే మొదటి బెలూన్ థియేటర్ గా కూడా పిలవబడుతుంది.[1][2]

కె.బి థియేటర్
కె.బి థియేటర్
స్థాపన2022
వ్యవస్థాపకులుసహకార సంఘం
రకంసినిమా హాలు
ప్రధాన
కార్యాలయాలు
ఆసిఫాబాద్
సేవా ప్రాంతాలుఆసిఫాబాద్

చరిత్ర మార్చు

ఆసిఫాబాద్ పట్టణం అనేది ఆసిఫాబాద్ జిల్లా పరిపాలన పట్టణంగా ఉన్న కూడా గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ థియేటర్ లేకపోవటం దృష్ట్యా,[3] తెలంగాణా ప్రభుత్వం వారు మహిళా సంఘాల వారిని ప్రోత్సహించి వారితో ఈ థియేటర్ ని స్థాపింపజేయటం జరిగింది. 2022 మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఈ థియేటర్నీ జిల్లా కలెక్టరు రాహుల్ రాజ్ ప్రారంభించడం జరిగింది.

విశేషాలు మార్చు

గిరిజన ప్రాంతంగా ఉన్న ఆసిఫాబాద్లో 1990 తర్వాత ఒక్క సినిమా హాలు కూడా ఉండేది కాదు, దాదాపు ముప్పై సంవత్సరాల తరువాత ఈ థియేటర్ ని ప్రారంభించడం జరిగింది. ఈ థియేటర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ వారు ఒక పరస్పర సహాయక సహకార సంఘం గా స్థాపించడం జరిగింది. ఢిల్లీకి చెందిన పిక్చర్ టైం అనే అంకుర సంస్థ ఈ థియేటర్ కి సాంకేతిక సహాయం అందించారు. జిల్లాలోని వెనుకబడిన తరగతుల మహిళలకు ఈ సంస్థ ఉపాధి అవకాశాన్ని కల్పించింది.[4]

ఈ థియేటర్ ఒక బెలూన్ రూపంలో ఉంటుంది, దీంట్లో 35mm స్క్రీన్, 6.1 జె.బి డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టం ఉన్నాయి.

రాజమౌళి సందర్శన మార్చు

2022 ఏప్రిల్ 12న దర్శకుడు రాజమౌళి ఈ థియేటర్ని సందర్శించి, రౌద్రం రణం రుధిరం సినిమాని ఇక్కడ చూడటం జరిగింది. ఈ సినిమాలో ఈ థియేటర్ నెలకొని ఉన్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన గోండు వీరుడు కొమురం భీం ఆధారంగా భీం పాత్ర ఉండటం విశేషం.

[5]

మూలాలు మార్చు

  1. ఇండియాలోని మొదటి బెలూన్ సినిమా టాకీస్? | First Balloon Theatre In India? |, retrieved 2022-12-14
  2. "Komaram Bheem Asifabad gets a balloon shaped movie theatre". ETV Bharat News (in ఇంగ్లీష్). Retrieved 2022-12-14.
  3. Vikas, Manda. "KB Theatres | మూడు దశాబ్దాల తర్వాత అక్కడ తొలి సినిమా థియేటర్.. ఎన్నో విశేషాలు!". Hindustantimes Telugu. Retrieved 2022-12-14.
  4. Today, Telangana (2022-03-12). "Kumram Bheem Asifabad gets its first theatre in 30 years, operated by women". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-12-14.
  5. correspondent, dc (2022-04-13). "Rajamouli watches RRR in Komaram Bheem theatre". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2022-12-14.