కోడి గుడ్డు (ఎడమ), క్వైల్ గుడ్లు (కుడి), ఇవి సాధారణంగా ఆహారపదార్థంగానూ కూడా ఉపయోగిస్తారు.
  • కోడి గుడ్డు (ఆంగ్లం : An egg) ఒక గుండ్రాకారం లేదా వర్తులాకారపు శరీరం, కోడి పెట్టే గుడ్డు కాబట్టి దీనికి కోడి గుడ్డు లేదా కోడి గ్రుడ్డు అని వ్యవహరిస్తాం. సాధారణంగా పక్షి గుడ్లలో కనిపించే ప్రధాన నిర్మాణమే కనిపిస్తుంది. అండము, దీని చుట్టూ పొరలు బాహ్యగోడ. ఈ గ్రుడ్డులో పచ్చసొన, తెల్లసొన వుంటాయి.
  • ప్రజలు కోడిగుడ్లను ఆహారపదార్థంగా వాడకము అనాదినుండి వస్తున్నది. ఇవి మంచి పోషక పదార్థాలు ప్రొటీనులు, కొలైన్లు కలిగివుండడం దీనికి కారణము.
గుడ్డు నిర్మాణం, అంతర్భాగాలు:
1. Eggshell
2. Outer membrane
3. Inner membrane
4. Chalaza
5. Exterior albumen
6. Middle albumen
7. Vitelline membrane
8. Nucleus of pander
9. Germinal disk
10. పచ్చసొన
11. తెల్లసొన
12. Internal albumen
13. Chalaza
14. గాలిగది
15. Cuticula
Chicken egg, whole, hard-boiled
Nutritional value per 100 g (3.5 oz)
శక్తి647 kJ (155 kcal)
1.12 g
10.6 g
12.6 g
విటమిన్లు Quantity
%DV
విటమిన్ - ఎ
18%
140 μg
థయామిన్ (B1)
57%
0.66 mg
రైబోఫ్లావిన్ (B2)
42%
0.5 mg
పాంటోథెనిక్ ఆమ్లం (B5)
28%
1.4 mg
ఫోలేట్ (B9)
11%
44 μg
ఖనిజములు Quantity
%DV
కాల్షియం
5%
50 mg
ఇనుము
9%
1.2 mg
మెగ్నీషియం
3%
10 mg
ఫాస్ఫరస్
25%
172 mg
పొటాషియం
3%
126 mg
జింక్
11%
1.0 mg
ఇతర భాగాలుపరిమాణం
నీరు75 g
Choline225 mg
Cholesterol424 mg

For edible portion only. Refuse: 12% (Shell)
Percentages are roughly approximated using US recommendations for adults.
Source: USDA Nutrient Database

కోడి గుడ్ల ఆకారాలు మార్చు

కోడిగుడ్లను వీటి సైజులను బట్టి వ్యాపారం కొరకు విభజిస్తారు. అమెరికాలోని వ్యవసాయ శాఖ ప్రకారం, బరువును ఒక డజనుకు లెక్కిస్తారు. ఈ క్రింది పట్టిక చూడండి;

నవీన సైజులు (అమెరికా)
సైజు గుడ్డు బరువు వంటకం సాధించవచ్చు (ఘనపరిమాణం) [1]
జంబో 2.5 ఔన్సుల కన్నా ఎక్కువ. లేదా 71గ్రాములు
అతి పెద్ద (XL) 2.25 ఔన్సుల కన్నా ఎక్కువ. లేదా 64 గ్రాములు 56 మి.లీ. (4 టేబుల్ స్పూన్)
పెద్ద (L) 2 ఔన్సుల కన్నా ఎక్కువ. లేదా 57 గ్రాములు 46 మి.లీ. (3.25 టే.స్పూ.)
మీడియం (M) 1.75 ఔన్సుల కన్నా ఎక్కువ. లేదా 50 గ్రాములు 43 మి.లీ (3 టే.స్పూ.)
చిన్నది (S) 1.5 ఔన్సుల కన్నా ఎక్కువ. లేదా 43 గ్రాములు
అతి చిన్నది (Peewee) 1.25 ఔన్సుల కన్నా ఎక్కువ. లేదా 35 గ్రాములు

ఐరోపాలో గుడ్ల నవీన సైజులు క్రింది విధంగా ఉన్నాయి.

నవీన సైజులు (ఐరోపా)
పరిమాణం గుడ్డు బరువు
అతి పెద్దది 73 గ్రా., అంతకన్నా ఎక్కువ
పెద్దది 63-73 గ్రా.
మధ్యమ సైజు 53-63 గ్రా.
చిన్న సైజు 53 గ్రా., అంతకన్నా తక్కువ

ఆస్ట్రేలియాలోని ఆస్ట్రేలియా ఎగ్ కార్పొరేషన్ ప్రకారం క్రింది సైజులు వాటి లేబులింగ్ గైడ్ పై వ్రాసి వుంటుంది.[2]

నవీన సైజులు (ఆస్ట్రేలియా)
పరిమాణం గుడ్డు బరువు
Jumbo 68 గ్రా.
మరింత పెద్దది 60 గ్రా.
పెద్దది 52 గ్రా.

పశ్చిమ ఆస్ట్రేలియాలో, రెండు అదనపు సైజులు, కార్పొరేషన్ ద్వారా గుర్తింపబడ్డాయి.[3]

అదనపు సైజులు (పశ్చిమ ఆస్ట్రేలియా)
మెగా లేదా XXXL 72 గ్రా.
మీడియం 43 గ్రా.

న్యూజీలాండ్ సైజులు, ప్రతి గుడ్డు భారముపై ఆధారపడి వుంటుంది.[4]

నవీన సైజులు (న్యూజీలాండ్)
పరిమాణం ప్రతి గుడ్డు కనీస బరువు
8 (జంబో) 68 గ్రా.
7 (పెద్దది) 62 గ్రా.
6 (స్టాండర్డ్) 53 గ్రా.
5 (మీడియం) 44 గ్రా.
4 (పుల్లెట్) 35 గ్రా.
సాంప్రదాయక సైజులు
పరిమాణం బరువు
సైజు 0 75 గ్రాముల కన్నా ఎక్కువ
సైజు 1 70-75 గ్రా.
సైజు 2 65-70 గ్రా.
సైజు 3 60-65 గ్రా.
సైజు 4 55-60 గ్రా.
సైజు 5 50-55 గ్రా.
సైజు 6 45-50 గ్రా.
సైజు 7 45 గ్రా.ల కన్నా తక్కువ

కోడి గుడ్ల తో తయారు చేసే ఆహార పదార్థాలు మార్చు

  • కోడిగుడ్డు దోశె (ఆమ్లెట్)
  • ఉడికించిన కోడి గుడ్డు (బాయిల్డ్ ఎగ్)
  • కూర

గుడ్డు పొడి మార్చు

thumb|పచ్చి, ఉడకబెట్టిన గుడ్డు తిరిగేటప్పుడు ఎలా స్పందిస్తుందో తెలిపే ఉదాహరణ. ముందుగా ఉడికించిన గుడ్డు. ఆహార పదార్థాల ఉత్పత్తిలో జంతు హింసకు తావు ఉండకూడదనే ఉద్దేశంతో.. 'పేపాల్'ను స్థాపించిన వారిలో ఒకరైన పీటర్ థియెల్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌ గేట్స్ గుడ్డు పొడిని అభివృద్ధి చేశారు. దీనిపేరు.. బియాండ్ ఎగ్స్. 12 రకాల మొక్కల నుంచి తీసిన గుజ్జును కొన్ని ప్రత్యేక పాళ్లలో కలిపి ప్రాసెస్ చేయడం ద్వారా దీన్ని తయారుచేస్తున్నారు. ఇంకా.. కేకులు, ముఫిన్లు రకరకాల బేకరీ పదార్థాల తయారీలోనూ నిరభ్యంతరంగా దీన్ని వాడేసుకోవచ్చు. పూర్తిస్థాయిలో సహజమైన గుడ్డు నుంచి వచ్చే రుచి రాదుగానీ.. దాదాపుగా ఆ రుచి ఉంటుందని, పోషక విలువలు మాత్రం అన్నీ ఉంటాయని, దీని రూపకర్తలు ప్రకటించారు.

మూలాలు మార్చు

  1. "What to Do With Egg Whites". gourmetsleuth.com/. Archived from the original on 2008-02-22. Retrieved 2008-01-13.
  2. "Egg Labelling Guide July 2007" (PDF). Archived from the original (PDF) on 2009-02-27. Retrieved 2009-02-21.
  3. "Golden Eggs Western Australia Product Range". Archived from the original on 2010-02-08. Retrieved 2009-02-21.
  4. "Egg Producers Federation of New Zealand - Egg Quality". Archived from the original on 2009-02-25. Retrieved 2009-02-21.

బయటి లింకులు మార్చు

ఎగ్