ఖడ్గలక్షణ శిరోమణి

ఖడ్గలక్షణ శిరోమణి నవనప్ప అనే ఖడ్గ నిపుణుడు రచించిన తెలుగు పుస్తకం. దీనికి నిడుదవోలు వేంకటరావు గారు విపులమైన పీఠిక వ్రాశారు. దీనిని మద్రాసు ప్రభుత్వం 1950 సంవత్సరంలో ముద్రించింది.

ఖడ్గాల రకాలు, వాటి తయారీ విధానం, ప్రత్యేకమైన ఉపయోగాలు వంటి ఎన్నో విశేషాలతో రాసిన చంపూ గ్రంథమిది. రచయిత పుదుక్కోటైకు చెందిన విశ్వబ్రాహ్మణ కులస్తుడు, కత్తుల తయారీలో నిపుణుడు ఐన నవనప్ప. పూర్వ సమాజంలో వివిధ కులస్తులు తమ తమ ప్రత్యేక వృత్తినైపుణ్యాల గురించి విపులంగా రచించిన వృత్తి విద్యా గ్రంథాల్లో ఇది ఒకటి. ఇప్పటికి సామూహిక చేతన నుంచి జారిపోయిన ఎన్నో రకాల కత్తుల పేర్లు, వాటి వివరాలు ఇందులో అందిస్తారు. నిఘంటు నిర్మాణానికి ఆయా ఖడ్గాల పేర్లు, వివరాలు ఎంతగానో ఉపకరిస్తాయి.

మూలాలు మార్చు