ఖాదర్ మొహియుద్దీన్

ఖాదర్ మొహియుద్దీన్ ముస్లిం మైనార్టీవాదకవి. ముస్లిం అస్తిత్వవాద సాహిత్య సృష్టికి శంఖం పూరించారు. అతను రచించిన పుట్టుమచ్చకు ప్రముఖ స్థానం లభించడంతో పుట్టుమచ్చ ఖాదర్‌గా ప్రసిద్ధికెక్కారు. అతను సాహిత్య సేవను గుర్తించిన సామాజిక సాంస్కృతిక సాహిత్య సంస్థ ప్రజ్వలిత, సాహితీ సేవామూర్తి పురస్కారానికి ఎంపిక చేసింది.[1]

ఖాదర్ మొహియుద్దీన్
ఖాదర్ మొహియుద్దీన్
జననంఖాదర్‌ మొహియుద్దీన్‌ ముహమ్మద్‌ అబ్దుల్‌
(1955-08-10)1955 ఆగస్టు 10
India కృష్ణా జిల్లా చీమలపాడు
ప్రసిద్ధిప్రముఖ రచయిత.
మతంఇస్లాం
భార్య / భర్తజానకి
తండ్రిముహమ్మద్‌ అబ్దుల్‌ రజాఖ్‌
తల్లితురాబ్‌ బీబీ

జీవిత విశేషాలు మార్చు

అతను కృష్ణా జిల్లా చీమలపాడులో గ్రామంలో 1955 ఆగస్టు 10 న తురాబ్‌ బీబీ, ముహమ్మద్‌ అబ్దుల్‌ రజాఖ్‌ దంపతులకు జన్మించారు. అతను అసలు పేరు "ఖాదర్‌ మొహియుద్దీన్‌ ముహమ్మద్‌ అబ్దుల్‌". అతను సాహిత్య విశారద (ప్రయాగ) చదువుకున్నారు. అతనుకు తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో ప్రవేశం ఉంది. అతను వృత్తి పరంగా జర్నలిస్టు. 1978 నుండి 1991 వరకు 'విశాలాంధ్ర', 'ఉదయం', 'ఆంధ్రభూమి' దినపత్రికల్లో పలు బాధ్యతలు నిర్వహించారు.[2]

రచనా ప్రస్థానం మార్చు

అతను తన 19వ యేట 'విశాలాంధ్ర' దిన పత్రికలో 'చెహోవ్‌ సాత్విక విషాదం' వ్యాసం రాయడం ద్వారా రచన వ్యాసంగం ఆరంభం అయింది. అప్పటి నుండి వివిధ పత్రికల్లో, సంకలనాల్లో కవితలు, వ్యాసాలు, సాహిత్య విమర్శనా వ్యాసాలు, సమీక్షలు, సమీక్షా వ్యాసాలు చోటు చేసుకున్నాయి. ఆ కవితల్లో కొన్ని ఇతర భాషల్లోకి అనువదించబడి ఆయా భాషా పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఈ రచనలలో 1979లో రాసిన 'అనుభూతి వాదం అంటే ఏమిటి?' (ఆంధ్రజ్యోతి, 1979), 'ఆరుద్ర ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు' (ఉదయం, 1985), 'గద్దర్‌ ఒక యుద్ధనౌక', 'బ్రాహ్మణీకం నుంచి బ్రాహ్మణీకంలోకి...' (ఆంధ్రజ్యోతి వారపత్రిక) అను సాహిత్య వ్యాసాలు చర్చకు కారణమయ్యాయి. 1991లో ఫిబ్రవరిలో వెలువరించిన 'పుట్టుమచ్చ (కవితా సంపుటి) ', అప్పటి దాకా కొద్దిమంది ముస్లింల గొంతులోంచి బయటకు రాకుండా గుక్కపట్టిన దు:ఖాన్ని, వ్యధనూ వ్యక్తీకరించింది. తొలిసారిగా ముస్లింల జీవితంలో అనేక పార్శ్వాలను ఈ కవిత ద్వారా ఖాదర్‌ ప్రపంచం దృష్టికి తెచ్చాడు' అని ప్రశంసలందుకుంది. ఈ కవితా సంపుటిలోని 'పుట్టుమచ్చ' కవిత జాతీయ స్థాయిలో బహుళ ప్రజాదారణ పొందింది. అంతర్జాతీయ సాహిత్య సదస్సుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించి ఆంగ్లం జర్మన్‌, హిందీ, ఉర్దూ తదితర ఇతర భాషల్లోకి అనువదించబడింది. ఆయా భాషా పత్రికల్లో, సంకలనాల్లో చోటుచేసుకుంది. ఇండియా టుడే (పత్రిక), తానా, యువభారతి, భారత్‌ భవన్‌ (భోపాల్‌) లాంటి సంస్థలు రూపొందించిన ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వందా కవితలతో కూడిన సంకలనాల్లో 'పుట్టుమచ్చ' కవిత స్థానం పొందింది.[3][4] యాభై సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల సందర్భంగా 'భారతీయ ముస్లింల ముఖచిత్రం' అను సుదీర్ఘ చర్చా వ్యాసాన్ని ఎండి.రియాజ్‌ (వరంగల్‌) తో కలసి రాసి ప్రచురించారు. 1991లో విజయవాడ నుండి వెలువడిన 'షేర్‌ కాలమ్‌' పత్రికను నిర్వహించారు. 1998లో 'శ్రీ రాములయ్య' సినిమాకు కథను సమకూర్చారు.[2]

మూలాలు మార్చు

  1. తొలితెలుగు ముస్లిం కవి ఖాదర్‌ మొహియుద్దీన్‌ 08-05-2016[permanent dead link]
  2. 2.0 2.1 అక్షరశిల్పులు, (ముస్లిం కవులు-రచయితల సంకిప్త పరిచయం) - సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌
  3. "'కట్టుకథ' ఇంకా కాటేస్తూనే ఉంది,16-05-2016". Archived from the original on 2016-05-19. Retrieved 2016-05-16.
  4. హిందూత్వ’ దాష్టీకాన్ని ప్రశ్నించిన ముస్లింవాద కవిత్వం

ఇతర లింకులు మార్చు