గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి

గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి (నాని)

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 - ప్రస్తుతం
ముందు భూమా అఖిల ప్రియ
నియోజకవర్గం ఆళ్ళగడ్డ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 14 జులై 1987
ఎర్రగుడిదిన్నె, రుద్రవరం మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు గంగుల ప్రభాకర్ రెడ్డి, ఇందిర
బంధువులు గంగుల ప్రతాపరెడ్డి

జననం, విద్యాభాస్యం మార్చు

గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి 14 జులై 1987లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, రుద్రవరం మండలం, ఎర్రగుడిదిన్నె గ్రామంలో గంగుల ప్రభాకర్ రెడ్డి, ఇందిర దంపతులకు జన్మించాడు. ఆయన హైదేరాబద్ లో ఎంబీఏ పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం మార్చు

గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి తన తండ్రి గంగుల ప్రభాకర్ రెడ్డి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2019 ఎన్నికల్లో ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుండి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ పై 35,613 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు.[3]

మూలాలు మార్చు

  1. BBC News తెలుగు (24 May 2019). "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన యువత వీళ్లే". BBC News తెలుగు. Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.
  2. Sakshi (18 March 2019). "కర్నూలు జిల్లా... అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితా". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  3. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.