గమనశ్రమ రాగము
(గమనశ్రమ నుండి దారిమార్పు చెందింది)
గమనశ్రమ రాగము కర్ణాటక సంగీతంలో 53వ మేళకర్త రాగము.[1] [2].
రాగ లక్షణాలు మార్చు
ఆరోహణ : స రి గ మ ప ధ ని స (S R1 G3 M2 P D2 N3 S)
అవరోహణ : స ని ధ ప మ గ రి స (S N3 D2 P M2 G3 R1 S)
ఈ రాగంలోని స్వరాలు: శుద్ధ ఋషభము, అంతర గాంధారము, ప్రతి మధ్యమము, చతుశ్రుతి ధైవతము, కాకలి నిషాధము.
ఇది 17 మేళకర్త రాగమైన సూర్యకాంతం యొక్క ప్రతి మధ్యమ సమానము.
గమనశ్రమ జన్యరాగాలు మార్చు
గమనశ్రమ లో కొద్ది జన్య రాగాలు ఉన్నవి. వానిలో హంసనందిని, పూరీకళ్యాణి ముఖ్యమైనవి.
పూరీకళ్యాణి రాగము మార్చు
- ఉదాహరణలు
- ఓ రామ నీ నామ మేమి రుచిరా - రామదాసు కీర్తన.
- ఆనంద మానందమాయెను - రామదాసు కీర్తన.
- నీ సంకల్పం బెటువంటిదో గన నెంతవాడరా రామా - రామదాసు కీర్తన.
మూలాలు మార్చు
ఇది సంగీతానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |