గాంధీ చౌక్

తెలంగాణ రాష్ట్రం నిజామాబాదు నగరంలో అతిపెద్ద వాణిజ్య ప్రాంతం

గాంధీ చౌక్, తెలంగాణ రాష్ట్రం నిజామాబాదు నగరంలో అతిపెద్ద వాణిజ్య ప్రాంతం, 4-మార్గం ట్రాఫిక్ జంక్షన్. ఇది నగరం మధ్యలో ఉంది.[1] తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల మీదుగా వెలుతున్న 16వ జాతీయ రహదారి ఈ ప్రాంతంలో ప్రారంభమై ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్ వద్ద ముగుస్తుంది.[2]

గాంధీ చౌక్
ఆజామ్ రోడ్డులోని ఏషియన్ సినిమాస్ ఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్
చిరునామాలు16వ జాతీయ రహదారి, ఆర్.పి. రోడ్
ప్రదేశంనిజామాబాదు, తెలంగాణ, భారతదేశం
పోస్టర్ కోడ్503001
అక్షాంశ రేఖాంశాలు18°40′23″N 78°05′42″E / 18.67306°N 78.09500°E / 18.67306; 78.09500

మహాత్మా గాంధీ పేరుమీద ఈ ప్రాంతానికి పేరు పెట్టబడింది, ఈ ప్రాంతం మధ్యలో గాంధీ విగ్రహం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ అనేక వాణిజ్య సముదాయాలు, షోరూమ్‌లు, షాపింగ్ మాల్‌లు ఉన్నాయి. [3]

గాంధీ చౌక్ వద్ద రోడ్డులు మార్చు

రహదారి పేరు టెర్మినల్ (నగరంలో) కి.మీ.లో పొడవు (నగరంలో)
ఆర్.పి. రోడ్ (ఎన్.ఎచ్ 16) విఆర్ఈసి 9
బోధన్ రోడ్[4] జంకంపేట 10
గంజ్ రోడ్ గిర్రాజ్ కళాశాల 3
అజామ్ రోడ్ ఆకాశవాణి కేంద్రం 2

సమీప ప్రదేశాలు మార్చు

గంజ్ రోడ్ మార్చు

జిల్లాలోని ప్రధాన మార్కెట్ యార్డ్ ఈ ప్రాంతానికి సమీపంలోని గంజ్‌లో ఉంది.[5] ఇక్కడ కూరగాయల మార్కెట్, కొన్ని బంగారు షోరూమ్‌లు కూడా ఉన్నాయి. నిజామాబాదు జిల్లా లోని ఏకైక స్వయంప్రతిపత్తి కలిగిన కళాశాల[6] గంజ్ రోడ్డుకు సమీపంలో ఉంది.

ఆర్.పి. రోడ్ మార్చు

16వ జాతీయ రహదారిని రాష్ట్రపతి రోడ్ (ఆర్.పి. రోడ్) గా పిలుస్తారు. నగరంలో అత్యంత రద్దీగా ఉండే రహదారులలో ఒకటైన ఈ రోడ్డులో క్లాత్ ఎంపోరియంలు, మెడికల్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి. నిజామాబాదు బస్ స్టేషను, నిజామాబాదు ప్రభుత్వ వైద్య కళాశాల, నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రి, నిజామాబాదు రైల్వే స్టేషను మొదలైనవి ఉన్నాయి. ఇక్కడ అనేక ఎక్కువ ప్రధాన ప్రైవేట్ ఆసుపత్రులు, అనేక ప్రయోగశాలలు ఉన్నాయి.[7] కాంతేశ్వర్ దేవాలయం[8] కూడా ఉంది.

బోధన్ రోడ్ మార్చు

ఇక్కడున్న రోడ్లలో బోధన్ రహదారి అతి పొడవైన మార్గం. ఈ రోడ్డు గాంధీ చౌక్ వద్ద మొదలై నగరం శివార్లకు సమీపంలోని జంకంపేట ప్రాంతంలో ముగుస్తుంది. ఈ ప్రాంతంలో హోటళ్లు, వివిధ రకాల వాణిజ్య సముదాయాలు, ఎత్తైన అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా ముస్లిం జనాభా ఉంది.[9] ఇక్కడ ఎక్కువ ప్రమాదాలు సంభవించడంతో[10] తెలంగాణా ప్రభుత్వం రోడ్డు విస్తరణను చేసింది.[11]

అజామ్ రోడ్ మార్చు

ఇది బడా బజార్‌కి వెళ్ళే మార్గం. నగరంలోని ప్రధాన మార్కెట్ యార్డ్ లలో ఇదీ ఒకటి. నిజామాబాద్ రేడియో స్టేషన్ వద్ద శివాజీ చౌక్ సమీపంలో ఈ రహదారి ముగుస్తుంది.

మూలాలు మార్చు

  1. "Gandhi Chowk, Nizamabad Pin Code - Pin Codes and Streets in India". chennaisharetips.com. Archived from the original on 2015-06-18. Retrieved 2021-08-17.
  2. [1] Details of National Highways in India-Source-Govt. of India
  3. http://www.thehindu.com/news/national/telangana/festive-atmosphere-pervades-nizamabad/article7436958.ece
  4. Special Correspondent. "Removal of roadside vendors leads to tension". The Hindu.[permanent dead link]
  5. Special Correspondent. "Rallies, public meetings mark May Day". The Hindu.
  6. "Archived copy". Archived from the original on 9 February 2015. Retrieved 17 August 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  7. Special Correspondent. "Earthquake rumours jolt people". The Hindu.
  8. Staff Reporter. "Devotees throng Shiva temples". The Hindu.
  9. "Muslims of Telangana: A Ground Report". epw.in.
  10. Staff Reporter. "Eight persons killed in road accidents". The Hindu.
  11. Staff Reporter. "Ensuring road safety is the topmost priority". The Hindu.