గుజ్జుల యెల్లమందారెడ్డి

గుజ్జుల యెల్లమందారెడ్డి స్వాతంత్ర్య పోరాటయోధుడు, కమ్యూనిస్టు పార్టీ రాజకీయనాయకుడు.

యెల్లమందారెడ్డి రాజకీయ చైతన్యం లేని రోజులలో, ప్రకాశం జిల్లా, పెదచెర్లోపల్లి మండలంలోని నేరెడుపల్లి అనే కుగ్రామంలో, సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో ప్రజలకు రాజకీయ ఓనమాలు దిద్దించి దున్నేవాడికే భూమి దక్కాలనీ, పుల్లరికి వ్యతిరేకంగానూ, రైతులకోసం పోరాడిన మహానుభావుడు.వీరు ప్రాథమిక విద్యను ఒంగోలులో, ఉన్నత విద్యను నెల్లూరులో అభ్యసించారు. 1943 లో సీ.పీ.ఐ జాతీయ సమితి సభ్యునిగా, కేంద్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు.

యెల్లమందారెడ్డి 1952లో కనిగిరి శాసనసభ నియోజకవర్గం నుండి మద్రాసు శాసనసభకు ఎన్నికై శాసనసభ్యుడయ్యాడు. 1955లో తిరిగి అదే నియోజకవర్గం నుండి ఆంధ్రరాష్ట్ర శాసనసభకు ఎన్నికై, 1962 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా కొనసాగాడు. 1952 నుండి 1962 వరకూ ఎం.ఎల్.ఏగా పనిచేసి గ్రామసమస్యలూ, రైతులు, కార్మికులూ ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో ఏకరువు పెట్టిన నాయకుడీయన. 1962లో మార్కాపురం ఎం.పీగా ఎన్నికై ఉక్కు ఫ్యాక్టరీ కోసం తన ఎం.పీ పదవికి రాజీనామా చేశారు.యల్లమందారెడ్డి వంటి నాయకుల పోరాటాలవలననే మనకు నాగార్జునసాగర్, వెలిగొండ ప్రాజెక్టులు వచ్చినవి. పామూరు బస్ స్టాండులో యల్లమందారెడ్డి, ఆయన భార్య సరళాదేవి విగ్రహాలను ఏర్పాటుచేశారు.[1]

మూలాలు మార్చు

  1. ఈనాడు ప్రకాశం; 2013,జూలై-21; 8వపేజీ.