గుడివాడ గురునాథరావు

గుడివాడ గురునాథరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశాడు.[3]

గుడివాడ గురునాథ రావు

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1989 – 1999
నియోజకవర్గం అనకాపల్లి[1]

ఎమ్మెల్యే
పదవీ కాలం
1989 - 1994
నియోజకవర్గం పెందుర్తి నియోజకవర్గం

రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1989 - 1994

వ్యక్తిగత వివరాలు

జననం 4 మే 1955
మింది, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
మరణం 2001 నవంబరు 22(2001-11-22) (వయసు 46)
హైదరాబాద్
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ[2]
జీవిత భాగస్వామి గుడివాడ నాగరాణి
సంతానం 2, గుడివాడ అమర్‌నాథ్

రాజకీయ జీవితం మార్చు

గుడివాడ గురునాథరావు తన తండ్రి గుడివాడ అప్పన్న అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చాడు . ఆయన 1985లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 1989లో తిరిగి పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. గురునాథరావు 1998లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1999లో తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయాడు.

సంవత్సరం నియోజకవర్గం పేరు విజేత పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు మెజారిటీ
1985 పెందుర్తి ఆళ్ల రామచంద్రరావు తెలుగుదేశం పార్టీ 56498 గుడివాడ గురునాథ రావు కాంగ్రెస్ పార్టీ 47289 9209
1989 పెందుర్తి గుడివాడ గురునాథ రావు కాంగ్రెస్ పార్టీ 83380 పల్ల సింహాచలం తెలుగుదేశం పార్టీ 69477 13903
1998 అనకాపల్లి గుడివాడ గురునాథ రావు కాంగ్రెస్ పార్టీ 321840 చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ 295915 25925
1999 అనకాపల్లి గంటా శ్రీనివాస్ రావు తెలుగుదేశం పార్టీ 392984 గుడివాడ గురునాథ రావు కాంగ్రెస్ పార్టీ 334520 58564
భీశెట్టి అప్పల త్రినాధ రావు తెలుగుదేశం పార్టీ 13918

మూలాలు మార్చు

  1. "Members : Lok Sabha". Parliament of India, Lok Sabha. 2020-02-25. Retrieved 2020-02-25.
  2. "Gurunadha Rao Gudivada, Anakapalli Lok Sabha Elections 1998 in India LIVE Results - Latest News, Articles & Statistics". LatestLY. 2018-01-15. Archived from the original on 2020-02-25. Retrieved 2020-02-25.
  3. Lok Sabha (21 April 2022). "గుడివాడ గురునాధరావు". Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.