గుమ్మడి జోసఫ్ ప్రముఖ హృద్రోగ వైద్యులు (MBBS, M Sc, M D, Ph D, & MAMS FUCWI). ఆయన గుండె వ్యాథులపై పరిశోధనలు చేసి గుండెపోటు రాకుండా చేసే చికిత్సలను అభివృద్ధి పరచారు.[1]

జీవిత విశేషాలు మార్చు

ఆయన 1928 డిసెంబరు 6కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు లో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.బి.బి.ఎస్. చదివారు. నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్(న్యూఢిల్లీ) లో ఎం.డి(ఫిజియాలజీ) పట్టాను అందుకున్నారు. ఫిజియాలజీ లో పి.హెచ్.డి., ఎం.ఎ.ఎం.ఎస్. చేసారు. అనేక పరిశోధనా పత్రాలను వెలువరించారు.

ఉద్యోగ జీవితం మార్చు

ఆయన అనేక మెడికల్ కళాశాలలలో బోధించారు.[2] 1956లో ఆంధ్ర మెడికల్ సర్వీసులో లెక్చరర్ గానూ, 1959-61 లలో రీడరుగా 1962 -80 లలో ఫిజియాలజీ విభాగానికి ప్రొఫెసర్, విభాగాధిపతిగ పనిచేసారు. ఆయన గుంటూరు మెడికల్ కళాశాలలో కూడా బోధన చేసారు.[3] ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యులుగా (1980-86) కూడా ఉన్నారు[2]. ఉస్మానియా మెడికల్ కాలేజి లో గౌరవ ఆచార్యులుగా(1986) పనిచేసారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో,ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ హార్ట్ రీసెర్చ్ లో, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ ఫిజియాలజిస్ట్స్ అండ్ ఫార్మకోలాజిస్ట్స్, ఇండియాలో గౌరవ సభ్యత్వాన్ని పొందారు.

ఆయన లండన్లో పి.హెచ్.డి చేసినందుకు గ్రీన్ ఫీల్డు మెడల్ పొందారు.ఆయన సీనియర్ కామన్వెల్త్ ఫెలోషిప్ గ్రహీత, ఈమ్‌సిఒఎస్‌ఎ (విశాఖపట్నం) వారి సిల్వర్ మెమొంటో గ్రహీత.

వ్యక్తిగత జీవితం మార్చు

ఆయన భార్య విమలా జోసఫ్. ఆమె ఆంగ్లంలో బి.ఎ చేశారు.జోసఫ్ కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆయన కుమారుడు డా.జోయెల్ గుమ్మడి క్రైస్తవ బోధకుడు, రచయిత, సంగీతకారుడు, గాయకుడు, క్రీడాకారుడు, పారిశ్రామికవేత్త. కుమార్తె డా.శోభా పాల్, (ఎం.డి) డా.మనోహర్ పాల్(ఇ.ఎన్.టి సర్జన్) ని వివాహం చేసుకున్నారు. వారు దక్షిణ అమెరికాలో ఉన్నారు. కుమార్తె సుహ్రులత ఆలూర్ (పిల్లల మనోవిజ్ఞాన నిపుణురాలు) మెల్‌బోర్న్ లో పనిచేస్తున్నారు. ఆమె మెకానికల్ ఇంజనీరు అయిన ఆలూర్ తిమోటీ ను వివాహమాడి ఆస్ట్రేలియాలో నివాసముంటున్నారు. కుమారుదు సామ్యూల్ శరత్ గుమ్మడి (ఎం.బి.ఎ) సాఫ్టెన్షియల్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి జనరల్ మేనేజరుగా పనిచేస్తున్నాడు.[2]

మూలాలు మార్చు

  1. ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లిషర్స్,విజయవాడ ed.). శ్రీ వాసవ్య. 2011.
  2. 2.0 2.1 2.2 "Rev. Dr. Joel Gummadi and his Testimony". auctusholidays.com/.[permanent dead link]
  3. Joyous scenes witnessed at GMC reunion

ఇతర లింకులు మార్చు