గెడ్డాపు సత్యం ప్రముఖ పద్యకవి, సాహితీవేత్త.

గెడ్డాపు సత్యం
జననం(1936-02-03)1936 ఫిబ్రవరి 3
మరణం2015 జనవరి 8(2015-01-08) (వయసు 78)
మరణ కారణంశ్వాసకోశ వ్యాధి
జాతీయతభారతీయుడు
వృత్తితెలుగు అధ్యాపకుడు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల
సుపరిచితుడు/
సుపరిచితురాలు
పద్యకవి
గుర్తించదగిన సేవలు
  • కవితా వైజయంతి
  • జైత్రయాత్ర
పిల్లలుజి.లక్ష్మీప్రసాద్
తల్లిదండ్రులు
  • ఎర్రంనాయుడు (తండ్రి)
  • లక్ష్మమ్మ (తల్లి)

జీవిత విశేషాలు మార్చు

ఈయన శ్రీకాకుళం జిల్లా, సంతకవిటి మండలం, కాకరపల్లి గ్రామంలో 1936, ఫిబ్రవరి 3న లక్ష్మమ్మ, ఎర్రంనాయుడు దంపతులకు జన్మించారు. శ్రీకాకుళంలోని డిగ్రీ కళాశాలలో ఆచార్యులుగా పనిచేశారు.

సాహితీసేవ మార్చు

వీరు త్రిలిఙ్గపత్రిక, మిసిమి తదితర మాసపత్రికల్లో వ్యాసాలు రాశారు. ఆకాశవాణిలో కవితా స్రవంతి కార్యక్రమంలో స్వీయ కవితలు వినిపించారు. వర్ణనరత్నాకరం అనే పద్య సంకలనాలకు ఆయన వ్యాఖ్యానాలు రాశారు.

రచనలు మార్చు

  1. మృత్యుంజయుడు
  2. జైత్రయాత్ర
  3. శివకేశవమ్‌
  4. ప్రసన్నధర్మము
  5. కవితా వైజయంతి
  6. శ్రీ వేణుగోపబాల శతకము
  7. త్రికుటేశ్వర సుప్రభాతం మొదలైనవి.

మరణం మార్చు

వీరు విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శ్వాసకోశ వ్యాధితో జనవరి 8, 2015న మరణించారు.[1]

మూలాలు మార్చు