గోపీనాథ దీక్షితులు

గోపీనాథ దీక్షితులు తిరుమల ఆలయానికి తొలి అర్చకునిగా చరిత్ర ప్రసిద్ధి పొందిన వ్యక్తి. వైఖానస ఆగమంలో దేవాలయ పూజాపునస్కారాలు ప్రారంభించారు.

ప్రశస్తి మార్చు

తిరుమల ఆలయంలో వేంకటేశ్వరుని విగ్రహానికి పూజలు చేసిన తొలి అర్చకునిగా గోపీనాథ్ దీక్షితులకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. వేల సంవత్సరాల క్రితం తిరుమల దట్టమైన అడవులతో, వన్యమృగాలతో వుండి, ఆలయం మాత్రమే ఉండే రోజుల్లో నిత్యమూ స్వామివారి కైంకర్యం, పూజ నిర్వహించి రాత్రికి కొండదిగే ప్రయాసపూర్వకమైన పని నిర్వహించినట్లు పలు సాహిత్యాధారాలు పేర్కొంటున్నాయి.[1]

పారంపర్య వ్యవస్థ మార్చు

రామానుజాచార్యులు స్వయంగా పాంచరాత్ర ఆగమ విధానాన్ని పాటించినా తిరుమల ఆలయంలో మాత్రం గోవింద దీక్షితులు అనాది కాలంలో ప్రారంభించిన వైఖానస ఆగమోక్త పూజా విధానాన్నే కొనసాగించేలా వ్యవస్థను ఏర్పాటుచేయడం గోపీనాథుని ఏర్పాటు పట్ల చూపిన గౌరవమే. ఆయన ప్రారంభించిన అనేక పద్ధతులు ఈనాటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతూంటాయి.[1]

ప్రస్తావనలు మార్చు

గోపీనాథుని ప్రస్తావనలు సాహిత్యంలోనే కాక ఆలయానికి చెందిన మతపరమైన వ్యక్తుల వద్ద మౌఖికంగా కూడా వినవస్తాయి. తిరుమల శ్రీవారి తొలి అర్చకునిగా ఆయన ప్రసక్తి పురాణాల్లో కూడా వస్తుంది.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 తిరుమల చరితామృతం:పి.వి.ఆర్.కె.ప్రసాద్:ఎమెస్కో ప్రచురణ:ఆగస్టు 2013