చందా లింగయ్య ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను 1984లో బూర్గంపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2001లో ఖమ్మం జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా విజయం సాధించారు. ఈయన మన్యసీమ రాష్ట్రసాధన సమితి చైర్మెన్‌గా వ్యవహరిస్తున్నారు.

చందా లింగయ్య

రాజకీయ ప్రస్థానం మార్చు

చందా లింగయ్య తొలిసారిగా 1978లో జనతాపార్టీ తరఫున బూర్గంపాడు నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీచేసి ఓటమి చెందారు.[1] 1983లో ఇండిపెండెంటుగా పోటీచేసి మళ్ళీ ఓడిపోయారు. 1985లో మూడో ప్రయత్నంలో బూర్గుంపాడు శాసన సభ్యులు విజయం సాధించారు. ఆ తర్వాత1989, 1994, 1999లలో కూడా విజయం లభించలేదు. మొత్తం 6 సార్లు ఫోటీచేసి ఒక్కసారి మాత్రమే గెలుపొందినారు. 2001లో జడ్పీ చైర్మెన్‌ అయ్యారు. 2009లో పినపాక స్థానంలో పోటీకొరకు ప్రయత్నించిననూ పార్టీ టికెట్ లభించలేదు. చివరకు ఈయన భార్య చందా భారతిచే రెబెల్ అభ్యర్థిగా పోటీచేయించారు. చందా భారతి జడ్పీటీసి సభ్యురాలిగా పనిచేసింది.

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, ఖమ్మం మినీ, తేది 22-03-2009