చంపక కుటుంబము వృక్షశాస్త్రములోని ఒక కుటుంబము.[1]

సంపంగ చెట్టు

ఈ కుటుంబములో చెట్లను గుబురు మొక్కలును గలవు. ఆకులు ఒంటరి చేరిక, బిరుసుగా నుండును. సమాంచలము, లేతాకులకు గణుపుపుచ్చములు గలవు. ఇవి ఆయాకులు ఎండకు వాడి పోకుండ కాపాడు చుండును. పువ్వులు పెద్దవి. ఒక్కొక్క చోట నొక్కక్కటియే నుండును. పుష్పభాగములు వలయమునకు మూడు చొప్పుననే యుండును. ఈ కుటుంబము, తిప్ప గీగె, సీతాఫలము కుటుంబములని బోలి యున్నది. కాని ఆకులకు గణుపు పుచ్ఛములు గలవు. రక్షక పత్రములును ఆకర్షణ పత్రముల వలె నుండును. ఈ కుటుంబపు పెక్కు మొక్కల పుష్పములలో వృంతాగ్రము పొడుగై దానిపై పుష్ప భాగములు ఒంటరి చేరికగ, నమర్చి యుండుట చూడవచ్చును.

చంపక వృక్షమును (సంపంగి చెట్టును) దోటలందు బెంచుచున్నారు. ఈ చెట్టు విశేషముగ విశాఖపట్టణ ప్రాంతముల నున్నది. ఇది ఆకుపచ్చని పువ్వులు పూసెడు గుబురు మొక్కయగు సంపంగి కాదు. దీని పువ్వులు పచ్చగ నుండును. దీనినే సంపెంగ యని కూడా అంటారు.

సంపెంగ పువ్వులును బెరడును కషాయము గాచి యిచ్చిన మన్యపు జ్వరము తగ్గునట. పువ్వుల కషాయము బలమును, అన్న హితేవును కలుగ జేయును.

అనాసపువ్వు: ఈ మొక్క మనదేశములోనిది గాదు. ఇప్పుడక్కడక్కడ బెంచు చున్నారు. దీని కాయలును, కాయలనుండి దీసిన చమురుగును అజీర్ణము నీరసములకు బనిచేయును. ఇవి మనకు బయటి దేశముల నుండియే వచ్చు చున్నవి.

మూలాలు మార్చు

  1. వేమూరి, శ్రీనివాసరావు (1916). వృక్షశాస్త్రము. మద్రాసు: విజ్ఞాన చంద్రికా మండలి. p. 61. Retrieved 27 June 2016.