చట్టానికి కళ్లులేవు

చట్టానికి కళ్ళు లేవు 1981 లో ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా.ఇది సట్టం ఒరు ఇరుత్తరై అనే తమిళ సినిమాలు రీమేక్. ఇందులో చిరంజీవి, లక్ష్మి, మాధవి ప్రధాన పాత్రలు పోషించారు.

చట్టానికి కళ్లులేవు
దర్శకత్వంఎస్.ఎ.చంద్రశేఖర్
రచనమైలవరపు గోపి (మాటలు)
కథశోభ
నిర్మాతవంకినేని సత్యనారాయణ (నిర్మాత), అట్లూరి పూర్ణచంద్రరావు (సమర్పణ)
తారాగణంచిరంజీవి,
లక్ష్మి,
నారాయణరావు
ఛాయాగ్రహణండి. డి. ప్రసాద్
కూర్పుగౌతంరాజు
సంగీతంకృష్ణ - చక్ర
నిర్మాణ
సంస్థ
శ్రీకర్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
1981 అక్టోబరు 30 (1981-10-30)
భాషతెలుగు

కథ మార్చు

పోలీస్ ఇన్‌స్పెక్టర్ దుర్గ, విజయ్ అక్కా తమ్ముళ్ళు. ఇద్దరూ చిన్నతనంలో తమ తండ్రి మరణానికి కారణమైన జాన్, జావెద్, జనార్ధన్ అనే ముగ్గురు హంతకుల కోసం వెతుకుతుంటారు. దుర్గ వాళ్ళు చేసిన నేరాలు కోర్టులో నిరూపించి శిక్ష పడేలా చేయాలని చూస్తుంటుంది. కానీ విజయ్ కి మాత్రం చట్టంలో లొసుగుల వల్ల వాళ్ళను ఎప్పటికీ పట్టులేమనే నమ్మకం ఉంటుంది. ఎలాగైనా చట్టం కళ్ళు గప్పి ఒక్కొక్కరిని మట్టు పెట్టాలని ప్రయత్నిస్తుంటాడు. తెలివిగా పథకం వేసి జాన్, జనార్ధన్ లను మట్టు పెడతాడు. ఈ కేసు విచారణ చేస్తున్న దుర్గకు ఆటంకం కలుగుతుంది. తమ్ముడి మీద అనుమానం కలుగుతుంది కానీ నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు దొరకవు. చివరికి దుర్గ జావెద్ అక్రమాలని పసిగట్టి అతన్ని అరెస్టు చేయడానికి వెళుతుంది. జావెద్ ఆమెను అపహరిస్తాడు. సమయానికి విజయ్ వచ్చి ఆమెను కాపాడి అతన్ని చంపడంతో కథ ముగుస్తుంది.

తారాగణం మార్చు

పాటలు మార్చు

ఈ సినిమాలో మొత్తం అయిదు పాటలున్నాయి.[1]

  • చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
  • ఈ సొగసే
  • ఎవ్వరికీ చెప్పొద్దు
  • కలిసిపో నా కళ్ళలో

మూలాలు మార్చు

  1. "చట్టానికి కళ్ళు లేవు పాటలు". naasongs.com. Archived from the original on 24 నవంబర్ 2016. Retrieved 25 September 2017. {{cite web}}: Check date values in: |archive-date= (help)