ఈ వ్యాసము కాపీ హక్కుల ఉల్లంఘనకి దారితీస్తున్నది. వార్తా పత్రికలోని విషయము యధాతధముగా కాపీ చేయటానికి వీలుపడదు. ఈనాడు వెబ్ సైటు మీద ఉన్న విషయము ఈనాడు కాపీ హక్కు. అయితే అందులోని విషయమును సొంత మాటలలొ చెప్పొచ్చు లేకుంటే ఆ పేజీకి బయటి లింకు పెట్టొచ్చు.--వైఙాసత్య 22:34, 17 నవంబర్ 2005 (UTC)

ఈ వ్యాసము ప్రస్తుతము ఉన్న విధముగా వికిపీడియాలో తగదు కానీ అంతగా అజయ్‌కానూ మీద వ్యాసము రాయాలంటే మనము దీనిమీద కృషి చెయ్యొచ్చు. అజయ్‌కానూ మీద పేజీ అవసరమా అన్నది కూడా ప్రశ్నే --వైఙాసత్య 22:46, 17 నవంబర్ 2005 (UTC)
కాపి రైట్ లను విస్మరించినందుకు క్షమించాలి, మున్ముందు దృష్టిలో ఉంచుకుంటాను.
"అజయ్‌కానూ మీద పేజీ అవసరమా ?" .... అంటే ,
గాంధిని చంపినందుకు గాడ్సెను ద్వేషించే పరిస్థితులు ఉన్నవి(నాడు ,నేడు), గాడ్సె చేసింది (తప్పయినా, ఒప్పయినా) ఎందుకు చేయాల్సి వచ్చింది అనే జిజ్ఙాస చాలామందికి లేకపోలేదు, ప్రాథమిక ప్రచారములో ఉన్న సాహిత్యంలో మనకు ఆసక్తి ఉన్నవి దొరకక పోవొచ్చు, దొరికినను దాని గురించి చదివితే లోకులు ఏమనుకుంటారు అని ధైర్యం చేయని వాళ్లు లేకపోలేదు.
"వికీపీడియా, ఒక స్వతంత్ర విజ్ఞాన సర్వస్వము "., అని మనమందరము మాట వరుసకు భావించకుండా నిష్పక్షపాత ధోరణిలో ఒక విజ్ఞాన సర్వస్వము రూపొందించాలి అని నా భావన  !
--జయ ప్రకాశ్ 16:59, 18 నవంబర్ 2005 (UTC)
అజయ్‌కానూ ఎటువంటి వాడు అన్నది కాదు నా ఉద్దేశము. వికిపీడియాలో రాయదగినంత ఫేమస్ అవునా?? కాదా?? అన్నదే నా ప్రశ్న. అపార్ధమునకు క్షమించవలె. సరే, మనము కలసి ఈ వ్యాసమును తిరిగి రాయుటకు ప్రయత్నము చేద్దాము --వైఙాసత్య 17:13, 18 నవంబర్ 2005 (UTC)


మీ సహకారనికి ధన్యవాదాలు, మీ తో కలిసి రచనలు చేయగలుగుతున్నందుకు చాలా సంతోషం --జయ ప్రకాశ్ 23:27, 18 నవంబర్ 2005 (UTC)
Return to "అజయ్ ‌కానూ" page.