చర్చ:అసభ్యం (ప్రొఫానిటీ)

తాజా వ్యాఖ్య: పేరు మార్పు ప్రతిపాదన టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ప్రొఫానిటీ అంటే బూతుపదం - ఊతపదం కాదు. తదృపేణా, యాతావాతా, మరేమో, పోతే, నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, వగైరా అన్నీ ఊతపదాలే. Vemurione (చర్చ) 01:44, 24 సెప్టెంబరు 2015 (UTC)Reply

Profanity అనగా ఆంధ్రభారతి నిఘంటువు ప్రకారం "అపచారము", "అపవిత్రము" అని అర్థం. కానీ గూగుల్ అనువాద పరికరంలో ఊతపదం అని అర్థం చూపించడం మూలంగా ఈ వ్యాస శీర్షిక మారింది. సరిచేయవలసి యున్నది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 02:28, 24 సెప్టెంబరు 2015 (UTC)Reply

పేరు మార్పు ప్రతిపాదన మార్చు

Profanity అనగా ఆంధ్రభారతి నిఘంటువు ప్రకారం "అపచారము", "అపవిత్రము" అని అర్థం. కానీ గూగుల్ అనువాద పరికరంలో ఊతపదం అని అర్థం చూపించడం మూలంగా ఈ వ్యాస శీర్షిక మారింది. సరిచేయవలసి యున్నది. అందువల్ల profanity అనగా "అసభ్యపదం" అవుతుందేమో! దయచేసి సరియైన శీర్షిక సూచించగలరు. నూతన శీర్షికకు తరలించిన తరువాత పూర్వపు శీర్షికను తొలగించవచ్చు.-- కె.వెంకటరమణచర్చ 02:33, 24 సెప్టెంబరు 2015 (UTC)Reply

profanity, n. అసభ్యం; అశ్లీలం; బూతు; అసభ్యపు మాట; బూతు మాట; బజారు భాష; మోటు భాష;

నిజానికి ఆంధ్రభారతి వారి అపవిత్రం కూడ సరి అయిన అనువాదం కాదు. నేను ఇచ్చిన పై అనువాదాలు చూడండి. మీకి నచ్చినది ఎంచుకోండి.Vemurione (చర్చ) 03:45, 24 సెప్టెంబరు 2015 (UTC)Reply

వేమూరి గారి సూచన మేరకు ఈ వ్యాసా శీర్షికను అసభ్యం (ప్రొఫానిటీ) గా మార్చితిని.-- కె.వెంకటరమణచర్చ 15:56, 24 సెప్టెంబరు 2015 (UTC)Reply
Return to "అసభ్యం (ప్రొఫానిటీ)" page.