చర్చ:ఖాదర్ పాషా దర్గా

తాజా వ్యాఖ్య: ధన్యవాదాలు టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Naidugari Jayanna
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.


నాయుడుగారి జయన్న గారూ, ఈ వ్యాసంలో మీరు, నిత్య ఆరాధన, మరియు కొలవడం లాంటి పదాలు వాడారు. కానీ ఈ పనులు దర్గాలలో చేయరు, ఫాతిహా ఖ్వానీ (చదివింపులు), గౌరవాభినందనలు చేస్తారు. ఔలియా కీర్తన (గౌరవాభినందన) లు వేరు, అల్లాహ్ కీర్తన (స్తోత్రం) వేరు. అల్లాహ్ కీర్తనను హమ్ద్ అనీ ఔలియాల కీర్తనను "మన్కబత్" అనీ అంటారు. ఔలియా అల్లాహ్ అనగా అల్లాహ్ యొక్క సన్నిహితులు. అన్యదా భావింపకండి, కేవలం విషయ పరిచయం కొరకు మాత్రమే వ్రాస్తున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 18:16, 19 సెప్టెంబరు 2014 (UTC)Reply

ధన్యవాదాలు మార్చు

అహ్మద్ నిసార్ గారూ! నమస్కారాలు. ఇందులో అన్యదా భావించవలసినదేమీ లేదు. మీకింకా ధన్యవాదాలు. తెలియని విషయాలు తెలియజేసినందుకు. వీటి గురించిన పూర్తి అవగాహనలేకపోవడం వలన వాటిని సమానార్థకాలుగా మాత్రమే వాడాను, మీరు సూచించిన విధంగానే సవరిస్తాను, కృతజ్ఞతలు.Naidugari Jayanna (చర్చ) 14:01, 20 సెప్టెంబరు 2014 (UTC)Reply

Return to "ఖాదర్ పాషా దర్గా" page.