ఈ వ్యాసానికి సరైన మూలాలు లేవు. ఉద్దేశపూర్వకంగా రాసినట్టు ఉంది. నిర్వాహకులు పరిశీలించి తొలగించగలరు Ch Maheswara Raju☻ (చర్చ) 02:12, 31 జనవరి 2022 (UTC)Reply

@Ch Maheswara Raju గారూ, సరైన మూలాలు లేవని రాసారు కదా.. మరింత వివరించండి.__ చదువరి (చర్చరచనలు) 02:28, 31 జనవరి 2022 (UTC)Reply
చదువరి గారు మూలాలు ప్రామాణికంగా లేవు అనిపిస్తుంది . అలాగే సూరజ్ బీరా గురించే అంతర్జాలంలో సర్చ్ చేస్తుంటే ప్రామాణిక వెబ్ సైట్స్ లో సమాచారం లభించడం లేదు.ఒకసారి మీరు కూడా పరిశీలించండి.Ch Maheswara Raju☻ (చర్చ) 03:05, 31 జనవరి 2022 (UTC)Reply
చూసాను @Ch Maheswara Raju గారు. ఈ వ్యాసంలో మూలాలుగా ఇచ్చిన లింకులు సందేహాస్పదంగా ఉన్నప్పటికీ వాటిలో కచ్చితంగా సమస్య ఇదీ అని అదమిత్థంగా చెప్పలేకున్నాను. అయితే కింది పాయింట్లు సందేహం కలిగిస్తున్నాయి
  1. ఈ వ్యాసం రాసిన ముగ్గురు వాడుకరులూ (Ventakeswaraswamigovinda, Lakshmiprasadv, Katherinetoday) కొత్తవారే, ఇక్కడ తప్ప మరెక్కడా రాయలేదు.
  2. ఈ వ్యాసాన్ని ఇంగ్లీషులో తొలగించారు
  3. క్రాస్ వికీ స్పామని అక్కడీ వాడుకరులు ఇక్కడ మూస పెట్టారు. ఆ మూసను పై ముగ్గురూ తీసేస్తున్నారు.
  4. ఈ ముగ్గురూ సాక్ పపెట్లని నా సందేహం. ఆ సందేహం తీర్చుకుందాం.
  5. తెలుగు పత్రికల్లో ఎక్కడా అతని గురించి సమాచారం లేకపోవడం
  6. మీరన్నట్టు ప్రామాణిక వెబ్‌సైట్లలో సమాచారం దొరకడం లేదు.
ఆ వాడుకరుల గురించి స్టీవార్డుల దగ్గర సమాచారం తీసుకుందాం. ఆ తరువాత వాళ్ళ సంగతి తేలుద్దాం. ఈ లోగా వ్యాసం గురించి మరింత సమాచారం దొరుకుతుందేమో చూద్దాం. మీ అనుమానం నిజమయ్యేటట్టే ఉంది.__ చదువరి (చర్చరచనలు) 11:20, 31 జనవరి 2022 (UTC)Reply
మెరుపు లాగా పనిచేసారు స్టీవార్డులు. ఆ ముగ్గురూ స్పామర్లేనని తేల్చేసారు. ముగ్గుర్నీ బ్లాకు చేసారు కూడాను.
ఈ పేజీ విషయానికి ప్రాముఖ్యత లేదనీ, ఇదొక క్రాస్ వికీ స్పాము అనీ నేను భావిస్తున్నాను. సత్వర తొలగింపునకు భిన్నంగా ఆలోచిస్తున్నవారు తమ ఆలోచనలను ఇక్కడ తెలపవలసినది. __ చదువరి (చర్చరచనలు) 12:08, 31 జనవరి 2022 (UTC)Reply
చదువరిగారు ఈ పేజీలో ఉన్న విషయానికి ప్రాముఖ్యత లేదనీ,నేను కూడా భావిస్తున్నాను. మీ మాటలకు నేను ఏకీభవిస్తున్నాను.వికీ నియమాలకు విరుద్ధంగా ఉంది కనుక వ్యాసాన్ని తొలగించడం మంచిదని నా అభిప్రాయం.Ch Maheswara Raju☻ (చర్చ) 12:21, 31 జనవరి 2022 (UTC)Reply

ఈ పేజీలో మూలంగా ఇచ్చిన లింకులు డబ్బులిచ్చి రాయించుకున్నవి/ప్రమోషను కోసం వేయించుకున్నవి

ఈ పేజీలో మూలంగా ఇచ్చిన టెలిగ్రాఫ్ వ్యాసం, స్పాన్సర్డ్ కంటెంటు విభాగంలో ఉంది. అంటే డబ్బులిచ్చి రాయించుకున్న వ్యాసమని అర్థం. దానికి సంబంధించిన వివరం ఇక్కడ చూడవచ్చు. అలాగే మరో మూలంలో ఇచ్చిన డి.ఎన్.ఏ లింకు పేజీలో కింద (Disclaimer- Brand Desk Content) అని రాసారు. అంటే అది కూడా వార్త కాదనీ, ఎవరో ఇచ్చిన కంటెంటు - బహుశా Brand Desk అనే సంస్య్థ వాళ్ళు ఇచ్చినది అయి ఉండవచ్చు. ఈ Brand Desk అనే సంస్థ బ్లాగులను, సామాజిక మాధ్యమాల్లో ఖాతాలనూ ప్రమోటు చేస్తుంది. క్రాస్ వికీ అనే మూసను తీసేసేందుకు తపన పడుతూ ప్రత్యేకంగా ఖాతాలను సృష్టించడం, డబ్బులిచ్చి రాయించుకున్న వ్యాసాలను మూలంగా చూపించడం చూస్తే ఇది స్పాము, స్వీయ ప్రచారం తప్ప మరోటి కాదని అర్థమౌతోంది. కాబట్టి దీన్ని తల్క్షణమే తొలగించాలి. Ch Maheswara Raju గారూ, ఈ అంశాన్ని లేవనెత్తినందుకు ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 10:51, 2 ఫిబ్రవరి 2022 (UTC)Reply

Brand Desk చేత ఇప్పించుకున్న మరొక ప్రకటనను ఇదిగో ఇక్కడ చూడవచ్చు. ఇందులో వ్యాసంలో పేరు పొరపాటున Surah Birla అని రాసారు. శీర్షికలో మాత్రం పేరు సరిగానే ఉంది. బహుశా అందుకేనేమో దీన్ని మూలంగా వాడలేదు. __ చదువరి (చర్చరచనలు) 10:56, 2 ఫిబ్రవరి 2022 (UTC)Reply
నాకు కూడా మొదటి నుంచి అనుమానంగానే ఉండింది. కానీ అది నిర్ధారించడానికి తగిన సమయం కేటాయించలేక ఊరకున్నాను. చిన్న వయసులో ఘనమైన లక్ష్యాలు సాధించినట్లు రాసేవారినంతా అనుమానించాల్సి వస్తోంది. ఈ వ్యాసం నుంచి నేను నేర్చుకున్న పాఠం ఏమిటంటే మూలాలు మంచి వార్తా పత్రికల నుంచి ఉన్నా అవి సరైన వార్తలా లేక పెయిడ్ న్యూసా అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి.- రవిచంద్ర (చర్చ) 11:50, 2 ఫిబ్రవరి 2022 (UTC)Reply

తొలగించిన వ్యాసాన్ని మళ్ళీ సృష్టించడం

చదువరిగారు నిన్న ఈ వ్యాసాన్ని రవిచంద్ర గారు తొలగించారు. కానీ తొలగించినా కొత్తగా వికీపీడియాలో ఖాతా తీసుకుని మళ్లీ సృష్టిస్తున్నారు.దీనికి సరైన పరిష్కారం ఆలోచించండి.Ch Maheswara Raju☻ (చర్చ) 03:55, 3 ఫిబ్రవరి 2022 (UTC)Reply

Return to "సూరజ్ బీరా" page.