చక్షుసుని పుత్రుడు చాక్షుసుడు. ఆరవ మనువు. చాక్షుష మన్వంతరమునకు అధిపతి. ఈ మన్వంతరములో క్షీరసాగర మథనం, మత్స్యావతారం వంటి ప్రధానమైన ఘట్టలు జరిగాయి.

చాక్షుష మన్వంతరము మార్చు

  • మనువు - చక్షుసుని పుత్రుడు చాక్షుసుడు
  • మనువు పుత్రులు - పురువు, పురుషుడు, సుద్యుమ్నుడు మొదలైనవారు
  • భగవంతుని అవతారాలు - అజితుడు, కూర్మావతారం - వైరాజునికి సంభూతియందు అజితుడనే పేర అవతరించాడు. ఇదే మన్వంతరంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతము కొరకై క్షీరసాగర మథనము చేశారు. భగవంతుడు కూర్మావతారుడై మందరగిరిని నిలిపాడు. శివుడు కాలకూట విషము మింగాడు. లక్ష్మీ దేవి అవతరించింది. సాగర మథనం చివర ధన్వంతరి అమృతంతో వచ్చాడు. మోహినీరూపుడై భగవంతుడు అమృతాన్ని దేవతలకు అందజేశాడు.
  • సప్తర్షులు - హవిష్మ దీరకాదులు
  • ఇంద్రుడు - మంత్రద్యుమ్నుడు
  • సురలు - ఆప్యాదులు

మన్వంతరము