చాగంటి సన్యాసిరాజు

చాగంటి సన్యాసిరాజు (1898 - ఫిబ్రవరి 22, 1961) ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, వైద్యుడు.[1]

చాగంటి సన్యాసిరాజు
జననం1898
మరణంఫిబ్రవరి 22, 1961
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, దర్శకుడు, వైద్యుడు

జననం - విద్యాభ్యాసం మార్చు

సన్యాసిరాజు 1898లో విజయనగరం జిల్లాలో జన్మించాడు. చిన్ననాటి చదువును విజయనగరంలో చదివిన రాజు, విశాఖపట్టణం లో వైద్య విద్యను పూర్తిచేసి, 1922లో సామర్లకోటలో వైద్య వృత్తిని ప్రారంభించాడు.

రంగస్థల ప్రస్థానం మార్చు

నాట్యాచార్య కిళాంబి కృష్ణమాచార్యులు ప్రోత్సాహంతో 1937లో వాణీ నాట్యమండలిని స్థాపించాడు. తన రంగస్థల ప్రస్థాన ప్రారంభదశలో మధుసేవ నాటకంలో కాశిం పాత్రను, ఖిల్జీ రాజ్యపతనంలో ఖిజిల్ ఖాన్ పాత్రలో నటించాడు. 1942లో ఆంధ్ర నాటక కళా పరిషత్తు నిర్వహించిన పోటీలో ఆంధ్రశ్రీకి ప్రథమ బహుమతి లభించింది. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ఈయనకు నటరాజ బిరుదును అందించారు. మయసభ దుర్యోధనుడు, కర్ణ భ్రాతృ ప్రేమ, ఒథెల్లో వంటి ఏకపాత్రాభినయాలు కూడా చేసి ప్రసంశలు అందుకున్నాడు.

నటించిన పాత్రలు మార్చు

రచించిన నాటకాలు మార్చు

  • అశోక నాటకం (1954)
  • రస ప్రదర్శనం - సంగీతం (1958)
  • భారతీయ నాటకం (1960)
  • భారతీయ నాటకరంగ చరిత్ర (అసంపూర్ణం)

మరణం మార్చు

సన్యాసిరాజు 1961, ఫిబ్రవరి 22న మరణించాడు.

మూలాలు మార్చు

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.625.