చాతక పక్షి (ఆంగ్లం:The Jacobin cuckoo) కోయిల జాతి పక్షి, ఆసియాలోనూ, ఆఫ్రికాలోను, మయన్మారులో కొన్నిచొట్ల ఈ పక్షి కనిపిస్తుంది. దీన్ని కొంతవరకు భారత్ లో వలసపక్షి అని పేర్కొనవచ్చు. భారతదేశం లోనికి ఈ పక్షి వచ్చే సమయాన్ని అనుసరించి, దీనితో పాటుగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయని భావిస్తారు. చాతకం కురిసే వర్షబిందువులతో దాహాన్ని తీర్చుకొంటుందని, యెట్టిపరస్థితిలోనూ భూమిమీద పడిన నీళ్ళు త్రాగదని అంటారు.

చాతక పక్షి
An adult (India)
శాస్త్రీయ వర్గీకరణ edit
Unrecognized taxon (fix): Cuculidae
Genus: Clamator
Species:
C. jacobinus
Binomial name
Clamator jacobinus
(Boddaert, 1783)
dark green - year round
yellow - summer only
blue - winter
cream - passage only
Synonyms

Oxylophus jacobinus
Coccystes melanoleucos
Coccystes hypopinarius

లక్షణాలు మార్చు

ఇది పొడవాటి తోక, బుజ్జిపక్షి, నలుపు తెలుపు కలగలిసి ఉంటుంది. దీని అరపు పెద్దగా ఈల వేసినట్లు ఉంటుంది. బ్రీడింగ్ రుతువులో ఆడామగ పక్షులు బాగా అరుస్తూంటాయి. బ్రీడీంగ్ సమయంలో మనదేశానికి వలస వస్తాయి. బురదలేని అడవుల్లో, మరీ అంతదట్టంగా వుండనిచొట నివాసం ఉంటాయి. గ్రంథాల్లో దీనిని ఆధ్యాత్మిక గవేషణ చేసే మునులతొ పోల్చుతారు. ఆ మునులు కుడా దీని వలే వర్షబిందువులను తాగి దప్పిక తీర్చుకొంటారని ప్రజల విశ్వాసం. పురాణసాహిత్యంలో, కావ్యాల్లో చాతకం ప్రస్తావనలు తరచుగా కనిపిస్తాయి. 2014 జూలై నెలలో చాతక పక్షి కడప జిల్లా అడవుల్లో కనిపించినట్లు పత్రికలలో వార్తలు వచ్చాయి[2].

మూలాలు మార్చు

  1. BirdLife International (2016). "Clamator jacobinus". IUCN Red List of Threatened Species. 2016: e.T22683800A93002088. doi:10.2305/IUCN.UK.2016-3.RLTS.T22683800A93002088.en. Retrieved 12 November 2021.
  2. The Hindu, dated 13/7/2014, Bangalore edition

బాహ్య లంకెలు మార్చు