చెరువుకొమ్ముపాలెం (పొన్నలూరు)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం


చెరువుకొమ్ముపాలెం, ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.. ఈ గ్రామం చెరువు గట్టున ఉంటుంది కనుక ఆ పేరు వచ్చిందంటారు. ఒక ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఈ ఊరికి నేరుగా బస్సు సౌకర్యం కూడా లేదు, ప్రక్కన వున్న కోటపాడు అగ్రహారంలో దిగి 1 కిలోమీటరు నడవాలి. ఊరిలోని పెద్దమనుషులు అందరు ఉదయం, సాయత్రం అగ్రహారంలో రచ్చబండ మీద కూర్చొని ఉంటారు. సుమారుగా 200 కుటుంబాలు ఉంటాయి. ఊరి చెరువు క్రింద 200 ఎకరాలు సాగులో ఉంది. ప్రధానంగా మెట్ట పంటలు పండుతాయి. ముఖ్యంగా పొగాకు, కంది, జొన్న పండిస్తారు. గ్రామంలో కొంతమందికి తోటలు ఉన్నాయి.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంపొన్నలూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08599 Edit this on Wikidata )
పిన్‌కోడ్523 111 Edit this on Wikidata

1987లో ఊరికి విద్యుత్తు సౌకర్యం వచ్చింది. ఊరికి 2, 3 కిలోమీటర్ల దూరంలో అడవి ఉంది. ప్రక్కగా లింగాల కొండ దాని కింద పాలెటి గంగమ్మ దేవాలయం. ప్రతి ఏడు జరిగే గంగమ్మ తిరునాళ్ళ చాలా ప్రసిద్ధి. ఈ రెండింటి మధ్య పాలేరు. ఇది కోటపాడు - అగ్రహారం మధ్య ప్రవహిస్తుంది.లువా తప్పిదం: Coordinates not found on Wikidata

మూలాలు మార్చు