చెరువు ఆంజనేయశాస్త్రి

చెరువు ఆంజనేయశాస్త్రి ఒక తెలుగు సినీ గేయ రచయిత. ఇతడు 1926, డిసెంబరు 3వ తేదీన జన్మించాడు. గుంటూరు జిల్లా, కొల్లూరు ఇతని స్వగ్రామం. ఇతడు ఉపాధ్యాయునిగా వృత్తిని స్వీకరించాడు. రంగస్థలానికి, ఆకాశవాణికి అనేక నాటికలను, నాటకాలను వ్రాశాడు. "వసంతవీణ", "కన్నె సుభద్ర", "పావన గంగ" అనే సంగీత రూపకాలు రేడియోలో ప్రసారమయ్యాయి. కార్తీక్ అనే కలం పేరుతో రచనలు చేశాడు. 1991, మార్చి 24న ఇతడు తనువు చాలించాడు[1].

సినిమా రంగం మార్చు

ఇతడు సతీ సుకన్య చిత్రానికి పద్యాలను వ్రాయడం ద్వారా చిత్రసీమలో ప్రవేశించి ఎక్కువ కాలం సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఇతడు రచించిన కొన్ని సినిమా పాటలు:[2]

క్ర.సం సినిమా పేరు విడుదలైన సంవత్సరం పాట పల్లవి గాయకుడు/గాయని సంగీత దర్శకుడు
1 దొరబాబు 1974 నీకు నాకు పెళ్ళంటే నేల నింగి మురిసాయి రామకృష్ణ, పి.సుశీల
2 పెళ్ళి కానుక 1960 ఆడేపాడే పసివాడా ఆడేనోయి నీతోడా ఆనందం పొంగేనోయి దీపావళి ఇంటింట వెలుగు దీపాల మెరుపు ఎనలేని వేడుకరా పి.సుశీల ఏ.ఎం.రాజా
3 మాంగల్య భాగ్యం 1974 నీలి గగనాలతాకే శిఖరాలపైన వెలసింది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం పి.భానుమతి, ఎం.ముత్తు
4 మోహన రాగం 1980 గలగల పారే సెలయేరా కిలకిల నవ్వే జవరాలా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల మాస్టర్ వేణు
5 సతీ సుకన్య 1959 ఘంటసాల వేంకటేశ్వరరావు
6 మనసే మందిరం 1966 అన్నది నీవేనా నా స్వామి ఉన్నది నీవే నాలోన నా స్వామి పి.సుశీల ఎం.ఎస్. విశ్వనాధం
7 అబ్బాయిగారు - అమ్మాయిగారు 1972 సుభద్రార్జునీయం (నాటకం ) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల కె.వి. మహదేవన్
8 అందాలరాశి 1979
9 ఆటగాడు 1980
10 పీటలమీద పెళ్ళి 1980 ముందడుగు వేసింది అందాల చిన్నది పి.బి. శ్రీనివాస్, బి.వసంత అశ్వత్థామ
11 ప్రతీకారం 1969 స్టాప్,లుక్ అండ్ గో పరువముతో పరుగిడకే జేసుదాసు, ఎస్.జానకి సత్యం
12 ప్రతీకారం 1969 సింతపువ్వంటి సిన్నదిరో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, టి.ఆర్.జయదేవ్, బెంగళూరు లత సత్యం
13 ప్రతీకారం 1969 ఇది నీదేశం ఇది నీకోసం ఇదే మహాత్ముల సందేశం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సత్యం
14 ప్రతీకారం 1969 నారీ రసమాధురీ లహరీ అనురాగ వల్లరి ఆనందఝరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సత్యం
15 ప్రతీకారం 1969 నా చూపే పిలుపురా ఆ పిలుపే కైపురా కాదనక ఎల్.ఆర్.ఈశ్వరి సత్యం
16 తండ్రులు కొడుకులు 1961 నీతలపే నీ వలపే నా హృదయాన నిండెనులే నా మనసే ఎస్. జానకి సత్యం

మూలాలు మార్చు

  1. తెలుగు సినీ గేయ కవుల చరిత్ర - పైడిపాల -డిసెంబర్ 2010-స్నేహ ప్రచురణలు, చెన్నై - పేజీ.194
  2. కొల్లూరి, భాస్కరరావు. "చెరువు ఆంజనేయశాస్త్రి". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 16 ఏప్రిల్ 2017. Retrieved 18 November 2016.