చేతనా దాస్

అస్సాంకు చెందిన సినిమా నటి.

చేతనా దాస్, అస్సాంకు చెందిన సినిమా నటి. అస్సామీ సినిమాల్లో హాస్య పాత్రలకు ప్రసిద్ధి చెందిన చేతనా, అస్సామీ సినిమా పరిశ్రమలో కామెడీ క్వీన్ గా పేరొందింది.[1]

చేతనా దాస్
జననం(1954-11-04)1954 నవంబరు 4
జాతీయతభారతీయురాలు
విద్యాసంస్థదర్రాంగ్ కాలేజ్, తేజ్‌పూర్‌
వృత్తినటి
బిరుదుఅస్సామీ సినిమా కామెడీ క్వీన్
జీవిత భాగస్వామిబిమలదండ దాస్

జననం, విద్య మార్చు

చేతనా దాస్ 1954, నవంబరు 4న మేఘాలయా రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లో జన్మించాడు. అస్సాం రాష్ట్రం తేజ్‌పూర్‌లోని దర్రాంగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.

కళారంగం మార్చు

మొదటి నాటకం జ్యోతి ప్రసాద్ అగర్వాలా రూపొందించిన సునీత్ కాన్వోరి నాటకంలో నటించి తేజ్‌పూర్ మల్టీపర్పస్ గర్ల్స్ స్కూల్ నుండి ఉత్తమ నటి అవార్డును కూడా పొందింది.[2]

వ్యక్తిగత జీవితం మార్చు

చేతనా దాసస్ భర్త బిమలదండ దాస్, 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో మరణించాడు.[3]

సినిమాల పాక్షిక జాబితా మార్చు

సంవత్సరం సినిమా పేరు
1973 టిటాష్ ఎక్తి నాదిర్ నామ్
1973 బనోరియా ఫుల్
1973 అభిజాన్
1976 షుర్జో గ్రహన్
1978 కల్లోల్
1980 ఇందిర
1980 అజలీ నబౌ
1984 మానిక్ రైటాంగ్
1984 కోకదేఉత నటి అరు హతీ
1985 అగ్నిస్నాన్
1986 పాపోరి
1988 కోలాహల్
1992 ఫిరింగోటి
1994 మీమాన్క్సా
1996 అదజ్య
1998 దిల్ సే
2000 హియా దియా నియా
2001 దాగ్
2002 కన్యాదాన్
జోనకి సోమ
2005 సురేన్ సురోర్ పుటేక్
2016 దూరదర్శన్ ఏటి జంత్ర
2019 రత్నాకర్

మూలాలు మార్చు

  1. "Kollywood Supporting Actress Chetana Das Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2022-02-12.
  2. "All you want to know about #ChetanaDas". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2022-02-12.
  3. Desk, Digital (2020-09-03). "Husband of Assam actress Chetana Das passes away » News Live TV »". News Live TV (in ఇంగ్లీష్). Retrieved 2022-02-12.

బయటి లింకులు మార్చు