Junk food , జంక్ ఫుడ్ మార్చు

సరియైన నూట్రిషనల్ విలువలు లేని లేదా అధిక కేలరీలు కలిగిన లేదా అనారోగ్యకరమైన అహారపదార్ధాలను జంక్ ఫుడ్స్ అంటారు. జంక్ ఫుడ్ తినడము వలన అనారోగ్యం నకు దారితీయును . ఈ పదము మొదట 1972 లో Michael Jacobson (director of the center for Science in the public interest) వాడుకలోకి తీసుకువచ్చారు . జంక్ ఫుడ్ లో ఎక్కువ పరిమాణములో సాచ్యురేటెడ్ కొవ్వులు, సాల్ట్, సుగర్ ఉంటాయి. ఆరోగ్యకరమైన పండ్లు, కాయకూరలు, ఫైబర్ ఉన్న పదార్ధములు ఉండవు . సాధారణముగా ఉప్పు స్నాక్స్ అంటే చిప్స్, కాండీ, తీపి ఉండలు, పంచదారపెట్తిన సీరల్స్, ఫ్రైడ్ ఫాస్ట్ ఫుడ్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్, రెడిమేడ్ కూల్ డ్రింక్స్, మసలా చాట్, పకోడీలు, బజ్జీలు వంటి స్నాక్ ఫుడ్‌, ఫాస్ట్ ఫుడ్ టమోటో కెచప్, వెన్నతో కూడిన కేకులు, చాక్లెట్‌ డింగ్‌-డాంగ్స్‌, బేకన్‌, సాసేజ్‌ మున్నగునవి.బర్గర్, పిజా, ఫ్రెంచి ఫ్రైస్, కేక్స్, నూడిల్స్... పిల్లలకు నచ్చే జంక్ ఫుడ్. ' జంక్‌ ఫుడ్‌ తింటే స్థూలకాయం (ఊబకాయం) వస్తుంది. ఈ ఊబకాయం వలన చిన్న వయస్సులోనే బిపి, ఆపై షుగర్‌ వస్తుంది. శాస్త్రవేత్తలు ధూమపానం, మత్తు మందుల మాదిరిగానే జంక్‌ ఫుడ్‌ తినడం కూడా వ్యసనంగా మారుతుందంటున్నారు. అంతే కాదు మనిషిపై మాదక ద్రవ్యంతో సమానంగా దుష్ప్రభావాన్ని సైతం చూపుతాయని వీరు కనుగొన్నారు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన స్క్రిప్స్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు మూడేళ్లపాటు పరిశోధనలు చేసి జంక్‌ ఫుడ్‌ కొకైన్‌ వంటి మాదక ద్రవ్యాలతో సమానమని తేల్చారు. జంక్‌ ఫుడ్‌కు అంటే బేకరి పదార్థాలకు అలవాటు పడితే అది ఊబకాయానికి దారి తీయడమే కాకుండా మెదడుకు కూడా హాని కలిగిస్తుందని కనుగొన్నారు. ఇందుకు కారణం బేకరీ పదార్థాల్లో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉండటమేనని వెల్లడించారు. జంక్‌ ఫుడ్‌ వల్ల కలిగే ప్రభావాలు తెలుసుకునేందుకు వీరు ఎలుకలపై మూడేళ్ల పాటు పరిశోధనలు సాగించారు. అధిక కేలరీలు గల ఆహారం తీసుకోవడం వల్ల మెదడుకు ప్రమాదమని తేల్చారు.

 
జంక్ ఫుడ్

దేశంలో శరవేగంగా పెరిగిపోతున్న ఫాస్ట్‌ ఫుడ్‌ సంస్కృతి మార్చు

దేశంలో ఫాస్ట్‌ ఫుడ్‌ సంస్కృతి శరవేగంగా పెరిగిపోతుంది. ఈ ఫుడ్‌ చాలా ఫాస్ట్‌ గురూ అని పిస్తోంది. దేశంలో గత కొన్ని సంవత్స రాలుగా ఫాస్ట్‌ ఫుడ్‌ పరిశ్రమ అనూ హ్యంగా అభివృద్ధి చెందుతోంది. దేశం లోని ప్రజల జీవన విధానంలో సంభ వించిన అనేక మార్పులు, ఆదాయాలు భారీగా పెరిగిపోవడం, ఆహార అభిరు చుల్లో తరచుగా మార్పులు చేసుకోవడం లాంటి ఘటనలు ప్రజలు కొత్త కొత్త రుచులకు అలవాటు పడటానికి, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లకు పరుగులు తీయ డానికి దోహదపడ్డాయి. దాంతో దేశంలోని ఫాస్ట్‌ ఫుడ్‌ పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు సాగుతోంది. భారతీయులు ఈ మధ్య కాలంలో తరచుగా విదేశాలను సందర్శించడంతో అక్కడి ఆహార అలవాట్లపై మోజు పెంచుకోవడం, జీవన విధానంలో మార్పులు చేసుకోవడం, తీసుకునే ఆహారంలో మార్పులు చేర్పులతో ప్రయోగాలు చేస్తున్నారని నిపుణులు చెపుతున్నారు. ఈ సందర్భగా భారత (ఉత్తర, తూర్పు ప్రాంతీయ) మెక్‌ డోనాల్డ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండి) విక్రమ్‌ బక్షీ మాట్లాడుతూ దేశం మొత్తం మేద ఫాస్ట్‌ ఫుడ్‌ మార్కెట్‌ వ్యాప్తి శరవేగంగా జరుగుతోందని, 2010 సంవత్సరంలో మెట్రోనగరాలలో దాదాపుగా ఫాస్ట్‌ ఫుడ్‌ అమ్మకాలు 20 శాతం మేరకు పెరిగిన్నట్లు అమ్మకాలను పరిశీలిస్తే తెలుస్తోందని చెప్పారు. అంతేకాక త్వరలో దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లను మరో 40 ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విధమైన సెంటర్‌లను దేశంలో మొట్ట మొదటి సారిగా 1996లో ఢిల్లీలోని బసంత్‌ లోక్‌లో మెక్‌డోనాల్డ్‌ ప్రారంభించిందని, ప్రస్తుతం మొత్తం 211 ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌లలో భారత్‌లోని ఉత్తర, తూర్పు ప్రాంతాలలో 105, పశ్చిమ, దక్షిణ భారత్‌లో 106 రెస్టారెంట్‌లు వున్నాయని బక్షీ తెలిపారు. మెక్‌డోనాల్డ్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌లు మెట్రో నగరాలతో పాటుగా మిగతా నగరాలలో కూడా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నాయని దానికి ఉదాహరణ హర్యానాలో 14, పంజాబ్‌లో 11, ఉత్తరప్రదేశ్‌లో 28 రెస్టారెంట్‌లు పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. దేశంలో పెరిగిపోతున్న చిన్న కుటుంబాలు, మధ్య తరగతి ప్రజలకు తగినంత ఆదాయం రావడం, ఇళ్ళలో వంట చేసుకొనే సమయం లేకపోవడం లాంటి అంశాలతో ఫాస్ట్‌ ఫుడ్‌ రంగం త్వరిత గతిన పెరగటానికి కారణంగా కనిపిస్తోందని, భవిష్యత్‌లో కూడా ఈ రంగం అభివృద్ధి చెందుతుని భావిస్తున్నట్లు నిరులా, విపి మార్కెటింగ్‌ విభాగానికి చెందిన రీతూ చౌదరి చెప్పారు. నిరులా కంపెనీ దేశంలోని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాంచల్‌, హర్యా నా, రాజస్థాన్‌, పంజాబ్‌లలో మొత్తం 80 ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌లను ప్రారంభించారు. 2012 నాటికి మరో 70 రెస్టా రెంట్‌లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్థానిక ప్రజలు ఫాస్ట్‌ ఫుడ్‌కు అలవాటు పడటంతో కంపెనీలు మంచి లాభాలు గడిస్తున్నాయని, దేశంలో మొట్ట మొదటి సారిగా పిజ్జాను ప్రవేశపెట్టామని, అది ప్రస్తుతం స్థానిక వినియోగదారులను ఆకర్శించిందని, అంతేకాక కరహీ పన్నీరు, తీఖా పన్నీరు, కరిహీ చికెన్‌లను ఇంతకు ముందే రుచి చూపించామని అని ప్రస్తుతం అవి విజయవంతం అయ్యాయని, త్వరలో మరికొన్ని రుచికర పదార్ధాలను అదించనున్నట్లు ఫిజ్జా హట్‌ మేనేజర్‌ ఉమేష్‌ కుమార్‌ తెలిపారు. బక్షీ మాట్లాడుతూ ఉత్తర భారతీయులు విభిన్న రుచులను ఎల్లప్పుడూ ఆదరిస్తారని, వీరిని దృష్టిలో పెట్టుకొని త్వరలో మెక్‌ఆలూ తిక్కీ బర్గర్‌, పిజ్జా మెక్‌పుఫ్‌, మెక్‌వెజ్‌లనే కొత్త రుచులను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. గడిచిన 2008, నుంచి 2010 మధ్య కాలంలో ఫాస్ట్‌ ఫుడ్‌ వినియోగం వార్షిక సగటు 7.8 శాతంగా పెరిగిందని, 2012 నాటికి సగటున 8.6 శాతానికి అభివృద్ధి చెందుతుందని ఒక నివేదిక తెలిపింది. ఈ సందర్భంగా బిపిఒలో పనిచేస్తున్న మోనా శర్మ (24) మాట్లాడుతూ తాము రాత్రులు కూడా పనిచేస్తుంటామని, పనిభారం కూడా వుంటుందని అందు వల్ల బయటకు వచ్చి తినటానికి సమయం లేదని, సహజంగా తమ కంపెనీలు కొంత మంది ఉద్యోగులు కలసి బయట రెస్టారెంట్ల నుంచి ఫుడ్‌ను తెప్పించుకొంటారని, పిజ్జాలు, బర్గర్‌లు వెంటనే తినటానికి వీలుగా వుంటాయి కనుక తమ సమయం వృధా కాకుండా వుంటుందని ఆమె తెలిపింది. ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లను కొన్ని వైవిధ్యమైన ప్రదేశాలలో స్థాపిస్తున్నారని, ప్రయాణంలో వున్న వారిని కూడా ఆకర్శించటానికి వీలుగా వ్యాపార కూడలల్లో, ఎయిర్‌పోర్టుల్లో, మెట్రో స్టేషన్‌లతో పాటుగా అనేక ప్రదేశాలలో ఈ ఫుడ్‌ సెంటర్‌లను ప్రారంభించారు. దేశంలో ఫాస్ట్‌ ఫుడ్‌ సంస్కృతి పెరిగిపోతుందని చెప్పాటానికి ఈ పరిమాణాలే ఉదాహరణగా చెప్పావచ్చును.

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=జంక్_ఫుడ్&oldid=3949603" నుండి వెలికితీశారు