జగిత్యాల మండలం

తెలంగాణ, జగిత్యాల జిల్లా లోని మండలం

జగిత్యాల మండలం, తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాకు చెందిన మండలం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[1] ప్రస్తుతం ఈ మండలం జగిత్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో నాలుగు  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. [2][3] ఇది జగిత్యాల జిల్లాకు, రెవెన్యూ డివిజనుకు, మండలానికి ప్రధాన కేంద్రం. జగిత్యాల మండలం, నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంలోని, జగిత్యాల శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది. ఇది సముద్ర మట్టానికి 293 మీటర్ల ఎత్తులో ఉంది.మండలం కోడ్:04414.[3] తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు 190 కి.మీ.దూరంలో ఉంది.

జగిత్యాల
—  మండలం  —
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, జగిత్యాల స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, జగిత్యాల స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, జగిత్యాల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°47′18″N 78°54′49″E / 18.788200°N 78.913600°E / 18.788200; 78.913600
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జగిత్యాల జిల్లా
మండల కేంద్రం జగిత్యాల
గ్రామాలు 4
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 1,69,064
 - పురుషులు 83,887
 - స్త్రీలు 85,177
అక్షరాస్యత (2011)
 - మొత్తం 68.76%
 - పురుషులు 70.01%
 - స్త్రీలు 53.85%
పిన్‌కోడ్ 505327

గణాంకాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 జనాభా లెక్కల ప్రకారం జగిత్యాల మండలం మొత్తం జనాభా 169,064. వీరిలో 83,887 మంది పురుషులు 85,177 మంది స్త్రీలు. మండలంలో మొత్తం 41,715 కుటుంబాలు నివసిస్తున్నాయి. జగిత్యాల మండలం సగటు లింగ నిష్పత్తి 1,015.మొత్తం జనాభాలో 61.5% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 38.5% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 77.5% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 54.9%. అలాగే మండలంలో పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 1,005 కాగా గ్రామీణ ప్రాంతాల వారిది 1,032. మండలంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 16947, ఇది మొత్తం జనాభాలో 10%. 0-6 సంవత్సరాల మధ్య 8760 మంది మగ పిల్లలు, 8187 మంది ఆడ పిల్లలు ఉన్నారు.మండలం లోని బాలల లింగ నిష్పత్తి 935, ఇది జగిత్యాల మండల సగటు లింగ నిష్పత్తి (1,015) కంటే తక్కువ.మండల మొత్తం అక్షరాస్యత రేటు 68.76%. జగిత్యాల మండలంలో పురుషుల అక్షరాస్యత రేటు 70.01%, స్త్రీల అక్షరాస్యత రేటు 53.85%.[4]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 42 చ.కి.మీ. కాగా, జనాభా 113,543. జనాభాలో పురుషులు 56,594 కాగా, స్త్రీల సంఖ్య 56,949. మండలంలో 27,515 గృహాలున్నాయి.[5]

రవాణా సౌకర్యాలు మార్చు

సమీపంలో జగిత్యాలకు లింగంపేట్- జగిత్యాల్ (ఎల్‌పిజెఎల్) అనే రైల్వే స్టేషన్ ఉంది. ఇది వ్యవసాయ,ఇతర ఉత్పత్తులు త్వరితగతిగా ఎగుమతి చేయటానికి సౌకర్యంగా ఉంది.ఈ స్టేషన్ నుండి ప్రతిరోజూ ప్రయాణీకులు వేలకొద్దీ ప్రయాణిస్తుంటారు.ఇది జిల్లా ప్రధాన కార్యాలయంగా మారిన తరువాత ఒక ప్రధాన స్టేషన్‌గా మారింది.తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థకు చెందిన బస్సు డిపో ఇక్కడ ఉంది.ఇక్కడ నుండి సమారు 200 బస్సులు వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తాయి.

సమీప పట్టణాలు మార్చు

కోరట్ల, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల సమీప పట్టణాలు

సమీప దర్శనీయ ప్రదేశాలు మార్చు

సిర్పూర్, మెదక్, వరంగల్ (ఒరుగల్లు), మేడారం ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు చూడటానికి సమీపంలో ఉన్నాయి.

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. జగిత్యాల
  2. తిప్పన్నపేట
  3. ధరూర్
  4. మోతే

మూలాలు మార్చు

  1. "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  2. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Jagitial.pdf
  3. 3.0 3.1 "Jagtial Mandal Villages, Karimnagar, Andhra Pradesh @VList.in". vlist.in. Archived from the original on 2019-12-23. Retrieved 2020-06-24.
  4. "Jagtial Mandal Population, Religion, Caste Karimnagar district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-07-27. Retrieved 2022-07-27.
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు