జతిన్ పరంజపే

భారతీయ క్రికెట్ ఆటగాడు

జతిన్ పరంజపే, భారతీయ క్రికెట్ ఆటగాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ గా రాణించాడు.

జతిన్ పరంజపే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జతిన్ వాసుదేయో పరంజపే
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుస్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్ డే ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 4 62 44
చేసిన పరుగులు 54 3,964 1,040
బ్యాటింగు సగటు 18.00 46.09 35.86
100s/50s 0/0 13/15 2/3
అత్యధిక స్కోరు 27 218 116*
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 54/– 8/–
మూలం: ESPNcricinfo, 2020 అక్టోబరు 19

జననం మార్చు

జతిన్ పరంజపే 1972, ఏప్రిల్ 17న జన్మించాడు. జతిన్ తండ్రి వాసూ పరంజపే 1960లలో మాజీ రంజీ ట్రోఫీ ఆటగాడు, నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రఖ్యాత కోచ్.[1][2]

వ్యక్తిగత జీవితం మార్చు

సోనాలి బింద్రే సోదరి గంధాలి బెంద్రేని జతిన్ పరంజ్‌పే వివాహం చేసుకున్నాడు.

క్రికెట్ రంగం మార్చు

మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయిన జతిన్ పరంజ్‌పే 1998లో అంతర్జాతీయ స్థాయిలో కొంతకాలం ఆడాడు. చీలమండ గాయం జాతీయజట్టు నుండి నిష్క్రమించాడు.[3] 1991/92 సీజన్‌లో తన రంజీ అరంగేట్రం చేసిన జతిన్, ఏడు సంవత్సరాలు తరువాత జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. నాలుగు రంజీ ట్రోఫీ ఔటింగ్‌లలో మొత్తం 606 పరుగులు చేశాడు, జాతీయ జట్టులో తనకు తానుగా చోటు దక్కించుకున్నాడు. పాకిస్తాన్ పర్యటనలో భారత "ఎ" జట్టులో భాగంగా ఉన్నాడు, అయితే అక్కడ అతను మంచి ప్రదర్శన చేయలేదు. కెన్యా, బంగ్లాదేశ్‌లతో కూడిన ముక్కోణపు సిరీస్‌లో మరొక వన్డేలో కూడా ఆడాడు.

టొరంటోలో జరిగిన సహారా కప్‌లో రన్-ఎ-బాల్‌లో అజేయంగా 23 పరుగులు చేసి ఓపెనింగ్ మ్యాచ్‌లో భారత్‌ను విజయపథంలో నడిపించాడు. రెండు మ్యాచ్ ల తర్వాత మైదానంలో తన చీలమండకు గాయం అవడంతో ఇంటికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అప్పటినుండి దేశవాళీ క్రికెట్‌కే పరిమితమయ్యాడు. 1999/2000 సీజన్‌లో 50.15 సగటుతో 652 పరుగులు చేశాడుకానీ, సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాడు. నైక్ ఫుట్‌బాల్ కోసం నెదర్లాండ్స్‌లో ఉన్న తర్వాత, జతిన్ 2014లో నైక్ క్రికెట్‌తో భారతదేశానికి తిరిగి వచ్చాడు.

2016, 2017లో భారతదేశ జాతీయ ఎంపిక ప్యానెల్‌లో సభ్యుడిగా ఉన్నాడు.[4][5]

మూలాలు మార్చు

  1. "Vasudev Paranjpe". ESPNcricinfo. Retrieved 2023-08-05.
  2. Monga, Sidharth (1 October 2020). "The legendary Mumbai mentor who made a mark on the careers of Rohit Sharma, Dravid, Gavaskar and others". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-05.
  3. Sriram, Natarajan (21 August 2000). "Indian news round-up". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-05.
  4. Gollapudi, Nagraj (7 January 2017). "Khoda, Paranjpe out of India's selection panel". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-05.
  5. Venugopal, Arun (21 September 2016). "MSK Prasad to head India's new selection panel". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-05.

బయటి లింకులు మార్చు