భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, దాని వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూను ప్రతిపాదించారు.[1] 2020 మార్చి 22న, భారత దేశ ప్రజలంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్ళ నుండి బయటికి రాకుండా, స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు.[2]

జనతా కర్ఫ్యూ
జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని వీడియో
సమయంఉదయం7 గంటల నుండి 9 గంటల వరకు
వ్యవథి14:00:00
తేదీ2020 మార్చి 22 (2020-03-22)
ప్రదేశంభారతదేశం

ప్రణాళిక మార్చు

జనతా కర్ఫ్యూ 2020 మార్చి 22 న జనతా కర్ఫ్యూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, 14 గంటల పాటు జరిగింది. పోలీసు, వైద్య సేవలు, మీడియా, హోమ్ డెలివరీ నిపుణులు, అగ్నిమాపక సిబ్బంది వంటి అవసరమైన సేవలు మినహా అందరూ కర్ఫ్యూలో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకు, కరోనా వైరస్‌ నియంత్రణకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి మద్దతుగా దేశ వ్యాప్తంగా ప్రజలంతా తమ ఇళ్లలోంచి బయటకు వచ్చి చప్పట్లతో తమ సంఘీభావం తెలిపారు. [3] తెలంగాణ ముఖ్యమంత్రి జనతా కర్ఫ్యూ పిలుపుకు మద్దతు ఇస్తూ తెలంగాణలో 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.[4]

ఇతర సంస్థలు మద్దతు మార్చు

దేశవ్యాప్తంగాగా ఆటో, టాక్సీ యూనియన్లు జనతా కర్ఫ్యూ సమయంలో తాము సేవలను అందించబోమని పేర్కొన్నారు.[5]

సోషల్ మీడియా స్పందన మార్చు

సోషల్ మీడియాలో జనతా కర్ఫ్యూపై ట్విట్టర్‌లో #JantaCurfewMarch22 అనే హ్యాష్‌ట్యాగ్ ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ అయ్యింది.[6]

జనతా కర్ఫ్యూ సంబంధించిన తప్పుడు సమాచారం మార్చు

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో హెలికాప్టర్ల ద్వారా కరోనా వైరస్ అరికట్టడానికి ఔషధం స్ప్రే చేస్తారని అవాస్తవ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.[7]

మూలాలు మార్చు

  1. Bureau, Our. "PM Modi calls for 'Janata curfew' on March 22 from 7 AM-9 PM". @businessline (in ఇంగ్లీష్). Retrieved 2020-03-22.
  2. DelhiMarch 19, India Today Web Desk New; March 20, 2020UPDATED:; Ist, 2020 05:15. "What is Janata Curfew: A curfew of the people, by the people, for the people to fight coronavirus". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-03-22. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  3. "PM Modi Speech on Coronavirus Highlights: Janata Curfew on Sunday, Avoid Panic Buying". News18. Retrieved 2020-03-22.
  4. Reporter, B. S. (2020-03-21). "Covid-19 scare: Telangana may close borders with Maharastra, says CM Rao". Business Standard India. Retrieved 2020-03-22.
  5. "Autos, Taxis to Remain Off-Road in Delhi During 'Janta Curfew'". News18. Retrieved 2020-03-22.
  6. "'Janta curfew March 22' trends on Twitter as Indians decide to stand in solidarity tomorrow". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-03-21. Archived from the original on 2020-03-22. Retrieved 2020-03-22.
  7. "Is government spraying coronavirus vaccine using airplanes? No, it's fake news". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-03-20. Retrieved 2020-03-22.