జాన్ మెక్‌లారెన్

ఆస్ట్రేలియా క్రికెటర్

జాన్ విలియం మెక్‌లారెన్ (1886, డిసెంబరు 22 - 1921, నవంబరు 17) ఆస్ట్రేలియా క్రికెటర్. 1912లో ఒక టెస్టులో ఆడాడు.[1]

జాన్ మెక్‌లారెన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జాన్ విలియం మెక్‌లారెన్
పుట్టిన తేదీ(1886-12-22)1886 డిసెంబరు 22
టూవాంగ్, క్వీన్స్‌ల్యాండ్, ఆస్ట్రేలియా
మరణించిన తేదీ1921 నవంబరు 17(1921-11-17) (వయసు 34)
హైగేట్ హిల్, క్వీన్స్‌ల్యాండ్, ఆస్ట్రేలియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 100)1912 23 February - England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1906–07 to 1914–15Queensland
కెరీర్ గణాంకాలు
పోటీ Tests First-class
మ్యాచ్‌లు 1 34
చేసిన పరుగులు 0 564
బ్యాటింగు సగటు 12.53
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 0* 43*
వేసిన బంతులు 144 5027
వికెట్లు 1 107
బౌలింగు సగటు 70.00 26.74
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/23 5/55
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 8/–
మూలం: Cricinfo, 2017 28 April

జీవిత విశేషాలు మార్చు

మెక్‌లారెన్ 1886, డిసెంబరు 22న విలియం - ఎలిజబెత్ మెక్‌లారెన్‌ దంపతులకు బ్రిస్బేన్‌లో జన్మించాడు.

క్రికెట్ రంగం మార్చు

ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు. 1906 నుండి 1915 వరకు క్వీన్స్‌లాండ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. 1907-08లో పర్యాటక ఇంగ్లీష్ జట్టుపై ఐదు వికెట్లు పడగొట్టాడు, అయినప్పటికీ క్వీన్స్‌లాండ్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది.[2] మూడు సంవత్సరాల తర్వాత పర్యాటక దక్షిణాఫ్రికాపై 55 పరుగులకు 5 వికెట్లు, 75 పరుగులకు 3 వికెట్లను తీసుకున్నాడు.[3]

మెక్‌లారెన్ 1911-12 యాషెస్ సిరీస్‌లో ఐదవ టెస్ట్‌కు ఎంపికైనప్పుడు ఆస్ట్రేలియా తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన మొదటి క్వీన్స్‌లాండ్‌లో జన్మించిన ఆటగాడు అయ్యాడు.[4] 1912లో ఆస్ట్రేలియా జట్టుతో కలిసి ఇంగ్లండ్‌లో పర్యటించాడు, కానీ ఏ టెస్టులోనూ ఆడలేదు.[5] మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, మెక్‌లారెన్ క్వీన్స్‌లాండ్ జట్లకు సెలెక్టర్, మేనేజర్‌గా పనిచేశారు.[5]

మరణం మార్చు

మెక్‌లారెన్ తన ముప్పై సంవత్సరాల వయసులో మధుమేహంతో బాధపడ్డాడు. తన 34 సంవత్సరాల వయస్సులో 1921, నవంబరు 17న బ్రిస్బేన్‌లోని తన ఇంటిలో మరణించాడు.[6] బ్రిస్బేన్ టూవాంగ్ స్మశానవాటికలో ఖననం చేయబడ్డాడు.[7]

మూలాలు మార్చు

  1. "John McLaren". CricketArchive. Retrieved 20 January 2022.
  2. "Queensland v MCC 1907-08". ESPNcricinfo. Retrieved 20 January 2022.
  3. "Queensland v South Africans 1910-11". ESPNcricinfo. Retrieved 20 January 2022.
  4. "The Ashes – 5th Test, 23,24,26,27,28,29 February, 1 March 1912". ESPNcricinfo. ESPN. Retrieved 2017-04-28.
  5. 5.0 5.1 The Oxford Companion to Australian Cricket, Oxford, Melbourne, 1996, p. 355.
  6. Error on call to Template:cite paper: Parameter title must be specified
  7. McLaren John William Archived 8 జూన్ 2012 at the Wayback Machine – Brisbane City Council Grave Location Search

బాహ్య లింకులు మార్చు