జై ప్రకాష్ యాదవ్

మధ్యప్రదేశ్ కు చెందిన భారతీయ క్రికెట్ ఆటగాడు

జై ప్రకాష్ యాదవ్, మధ్యప్రదేశ్ కు చెందిన భారతీయ క్రికెట్ ఆటగాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి మీడియం-పేస్ బౌలర్. 2002 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఉమ్మడి విజేతలలో ఒకటైన భారత జట్టులో యాదవ్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ టైటిల్‌ను శ్రీలంకతో పంచుకున్నారు.[1]

జై ప్రకాష్ యాదవ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జై ప్రకాష్ యాదవ్
పుట్టిన తేదీ (1974-08-07) 1974 ఆగస్టు 7 (వయసు 49)
భోపాల్, మధ్యప్రదేశ్
ఎత్తు5 ft 10 in (1.78 m)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-పేస్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 146)2002 నవంబరు 6 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2005 నవంబరు 5 - శ్రీలంక తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.69
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1994–2013మధ్యప్రదేశ్
2000–2010రైల్వేస్
2006/08ఢిల్లీ జెయింట్స్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్ డే ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ టీ20
మ్యాచ్‌లు 12 130 134 12
చేసిన పరుగులు 81 7,334 3,620 107
బ్యాటింగు సగటు 20.25 36.85 32.61 15.28
100లు/50లు 0/1 13/36 4/23 0/0
అత్యుత్తమ స్కోరు 69 265 128 33
వేసిన బంతులు 396 18,819 5638 264
వికెట్లు 6 296 135 12
బౌలింగు సగటు 54.33 23.13 29.32 26.83
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 18 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 2 0 0
అత్యుత్తమ బౌలింగు 3/32 8/80 5/49 3/21
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 84/– 46/– 3/–
మూలం: cricinfo, 2014 ఆగస్టు 13

జననం మార్చు

జై ప్రకాష్ యాదవ్ 1974, ఆగస్టు 7న మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జన్మించాడు.

క్రికెట్ రంగం మార్చు

2002 నవంబరు 6న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ వన్డేలోకి అడుగుపెట్టాడు. 12 మ్యాచ్ లు ఆడి 81 పరుగులు చేశాడు. అందులో 69 అత్యుత్తమ స్కోర్ సాధించడంతోపాటు 6 వికెట్లు తీశాడు.[2] 2005 నవంబరు 5 - శ్రీలంక తో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.[3]

ఫస్ట్-క్లాస్ క్రికెట్ లో 130 మ్యాచ్ లు ఆడి 7,334 పరుగులు చేశాడు. 265 అత్యుత్తమ స్కోర్ తో 13 సెంచరీలు, 36 అర్థ సెంచరీలు చేశాడు. 296 వికెట్లు తీశాడు.

లిస్ట్ ఎ క్రికెట్ లో 134 మ్యాచ్ లు ఆడి 3,620 పరుగులు చేశాడు. 128 అత్యుత్తమ స్కోర్ తో 4 సెంచరీలు, 23 అర్థ సెంచరీలు చేశాడు. 135 వికెట్లు తీశాడు.

టీ20 క్రికెట్ లో 12 మ్యాచ్ లు ఆడి 107 పరుగులు చేశాడు. 33 అత్యుత్తమ స్కోర్ చేశాడు. 12 వికెట్లు తీశాడు.

మూలాలు మార్చు

  1. "Jai Prakash Yadav Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-04.
  2. "IND vs WI, West Indies tour of India 2002/03, 1st ODI at Jamshedpur, November 06, 2002 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-04.
  3. "IND vs SL, Sri Lanka tour of India 2005/06, 5th ODI at Ahmedabad, November 06, 2005 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-04.

బయటి లింకులు మార్చు