జ్ఞానేష్ కుమార్

భారత ఎన్నికల కమీషనర్లు

జ్ఞానేష్ కుమార్ (జననం 27 జనవరి 1964) 1988-బ్యాచ్ కి చెందిన అధికారి. [1] రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, జ్ఞానేశ్ కుమార్ కేరళ కేడర్‌కు చెందిన వారు. జ్ఞానేష్ కుమార్ 2024 మార్చి 21న భారతదేశ సహకార కార్యదర్శిగా పదవీ విరమణ పొందారు. 2024 మార్చి 14న జ్ఞానేష్ కుమార్ భారత ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. [2] [3]

జ్ఞానేష్ కుమార్
భారత ఎన్నికల కమిషనరు
Assumed office
224 మార్చి 14
అంతకు ముందు వారుఅనూప్ చంద్ర పాండే
భారతదేశ సహకార కార్యదర్శి
In office
2022 మే 3 – 2024 జనవరి 31
అంతకు ముందు వారుదేవేంద్ర కుమార్ సింగ్
తరువాత వారుఆశిష్ కుమార్ భూటాని
వ్యక్తిగత వివరాలు
జననం (1964-01-27) 1964 జనవరి 27 (వయసు 60)
ఆగ్రా, ఉత్తరప్రదేశ్ భారతదేశం
వృత్తిఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ అధికారి

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

జ్ఞానేష్ కుమార్ భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లాలో 1964 జనవరి 27న జన్మించాడు.[4] జ్ఞానేష్ కుమార్ ఐఐటి కాన్పూర్ [5] నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో తన బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ పూర్తి చేసాడు , ఇండియాలో బిజినెస్ ఫైనాన్స్ హెచ్ఐడి, హార్వర్డ్ యూనివర్సిటీ, యుఎస్ లో ఎన్విరాన్‌మెంటల్ ఎకనామిక్స్ చదివాడు. [6]

వృత్తిజీవితం మార్చు

జ్ఞానేష్ కుమార్ గతంలో కేంద్రంలో పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శిగా పనిచేశారు హోం మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా కూడా పనిచేశారు.[7] జ్ఞానేష్ కుమార్ తన పదవీ కాలంలో అనేక సహకార సంస్థలను ఏర్పాటు చేశాడు, సహకార మంత్రిత్వ శాఖ [8] మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (ఎమ్మెస్సీ ఎస్) (సవరణ) చట్టం, 2023,[9] మూడు కొత్త జాతీయ సహకార సంస్థలు ఏర్పాటు చేశాడు. భారతీయ బీజ్ సహకారి సమితి లిమిటెడ్ (బి బి ఎస్ ఎస్ ఎల్) నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్ సి ఓ ఎల్), నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్ లిమిటెడ్ (ఎన్సీఈఎల్) లాంటి సహకార సంస్థలను భారతదేశంలో ఏర్పాటు చేశాడు. [10]

జ్ఞానేష్ కుమార్ యుపిఎ ప్రభుత్వ హయాంలో 2007 నుండి 2012 వరకు రక్షణ మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ (రక్షణ శాఖ కార్యదర్శి)గా పనిచేశారు. [11]

మూలాలు మార్చు

  1. "Civil List of IAS Officers". easy.nic.in. Retrieved 2024-03-18.
  2. "Who are new election commissioners Sukhbir Singh Sandhu and Gyanesh Kumar?". Hindustan Times. 14 March 2024. Retrieved 14 March 2024.
  3. "Who is Gyanesh Kumar, the newly appointed election commissioner". The Times of India. 14 March 2024. Retrieved 14 March 2024.
  4. "Who is Gyanesh Kumar, the newly-appointed Election Commissioner ?". Livemint (in ఇంగ్లీష్). 2024-03-14. Retrieved 2024-03-18.
  5. "In Agra, parents rejoice at Gyanesh Kumar's appointment as election commissioner". Hindustan Times (in ఇంగ్లీష్). 2024-03-15. Retrieved 2024-03-18.
  6. "Meet Gyanesh Kumar, the new Election Commissioner of India. He oversaw abrogation of Article 370". WION. Retrieved 2024-03-18.
  7. "Who is Gyanesh Kumar, the newly appointed election commissioner". The Times of India. 2024-03-14. ISSN 0971-8257. Retrieved 2024-03-18.
  8. "5 Points About Gyanesh Kumar, New Election Commissioner". NDTV. Retrieved 2024-03-18.
  9. PTI (2023-10-23). "Cooperative export body NCEL gets ₹7,000 crore orders so far, to share profit with member farmers: Amit Shah". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-03-18.
  10. "Who Are Gyanesh Kumar and Sukhbir Singh Sandhu, The Retired IAS Officers Appointed As Election Commissioners?". Outlook (Indian magazine) (in ఇంగ్లీష్). Retrieved 2024-03-18.
  11. "Who is Gyanesh Kumar, the Election Commissioner picked by PM Modi-led panel". The Indian Express (in ఇంగ్లీష్). 2024-03-14. Retrieved 2024-03-14.