టంకాల సత్యనారాయణ

టంకాల సత్యనారాయణ తెలుగు పద్య కవి. కవితా విశారద బిరుదు పొందినవాడు.

జీవిత విశేషాలు మార్చు

టంకాల సత్యనారాయణ అన్నపూర్ణ, అప్పన్న దంపతులకు 1908వ సంవత్సరం, జూన్ 30వ తేదీన జన్మించాడు. వైశ్య కులస్థుడు. దేవకుల గోత్రజుడు. శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలానికి చెందిన నివగం గ్రామం ఇతని స్వస్థలం. ఇతనికి సంగీత సాహిత్యాలలో ప్రవేశం ఉంది. ఇతడి ప్రతిభకు గుర్తింపుగా కవితా విశారద అనే బిరుదు లభించింది.

సత్యనారాయణ స్వప్రయత్నంతో పద్య రచన, కవిత్వం సాధించినవాడు. స్వతాహాగా భక్తుడు కావడంతో భక్తి సాహిత్యాన్ని, శతకాలను రచించి పలు దేవతా మూర్తులకు అంకితం ఇచ్చాడు.[1]

రచనలు మార్చు

  1. మూర్ఛనాదర్శిని (సంగీత గ్రంథము)
  2. శ్రీ రామాయణ సారామృతము (కంద పద్య శతకము)
  3. శ్రీమద్భాగవత సారామృతము (సీస కావ్యము)
  4. శ్రీ కృష్ణ పరమాత్మ జాతకము

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. శ్రీరామాయణ సారామృతము. 1965. Retrieved 9 February 2019. అభిప్రాయములు[permanent dead link]