టి.ఎన్.రామకృష్ణారెడ్డి

టి.ఎన్.రామకృష్ణారెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు, రాయలసీమకు చెందిన రాజకీయనాయకుడు. శ్రీబాగ్ ఒడంబడికను ఖరారు చేసిన బృందంలో ఈయన కూడా ఉన్నాడు.

రామకృష్ణారెడ్డి జస్టిస్ పార్టీ సభ్యుడు. 1934లో కాంగ్రేసు పార్టీ కేంద్ర శాసనసభకు జరగబోయే ఎన్నికల్లో పాల్గొనటానికి నిర్ణయించినప్పుడు రామకృష్ణారెడ్డిని తమ పార్టీ తరఫున పోటీ చెయ్యాలని ఆయన్ను కోరారు. కానీ ఆయన తిరస్కరించాడు.[1] ఈయన మద్రాసు రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా కూడా పనిచేశాడు.

రామకృష్ణారెడ్డి 1890లో చిత్తూరులో జన్మించాడు. ఈయన 1919లో బి.ఎల్ పట్టభద్రుడై వకీలుగా వృత్తిజీవితం ప్రారంభించాడు. ప్రజాజీవితంలో క్రియాశీలకమైన ఆసక్తిని పెంపొందించుకొని 1923లో తాలూకా బోర్డుకు ఉపాధ్యక్షుడిగా ఎన్నికై 1928వరకు ఆ పదవిని నిర్వహించాడు. 1924లో పట్టణ సహకార బ్యాంకు, జిల్లా సహకార బ్యాంకులకు నిర్దేశకుడయ్యాడు. మూడు పర్యాయాలు సహకార సంఘాల సమాఖ్య గౌరవనీయ సహాయ రిజిస్ట్రారుగా నియమితుడయ్యాడు.

1925లో చిత్తూరు పురపాలక సంఘం సభ్యుడై, ఆ తరువాత సంవత్సరం జిల్లా స్థానిక బోర్డుకు ఎన్నికయ్యాడు. 1928లో నియోజకవర్గం మార్చాడు. శాసనసభలో జాతీయ పార్టీలో చేరి, దాని కార్యదర్శిగా పనిచేశాడు. 1934లో ఐరోపా పార్లమెంటరీ సంఘం సభ్యుడిగా ఐరోపాను పర్యటించాడు. తిరిగివచ్చిన తర్వాత 1936లో చిత్తూరు జిల్లా బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కాంగ్రేసు పార్టీ తరఫున పోటీచేసి మద్రాసు శాసనసభలో చిత్తూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు..[2]

మూలాలు మార్చు