ఇది ఆంగ్లము లోని టెలీవిజను (television) పదము నుండి వచ్చింది. దీనిని తెలుగులో దూరదర్శిని అని కూడా అంటారు. ఇది మనకు బొమ్మలు, ధ్వనితో కలిపి వినిపిస్తుంది.

చరిత్ర మార్చు

ప్రపంచంలో మొట్టమొదటి సారిగా 1926 జనవరి 26 న ఎలెక్ట్రికల్ ఇంజినీర్ జె.ఎల్.బర్డ్ టివిని ఆవిష్కరించారు. అలాగే కలర్ టివికి చెందిన పిక్చర్ ట్యూబు ని కనుగొన్నారు . భారతదేశంలో టీవి మాధ్యమ ప్రసారాలు 1990 లో మొదలయ్యాయి . మొదట ఒకే ప్రసార కేంద్రం 41 టీవి సెట్లతో ఒకటే ఛానెల్ తో వారానికి రెండు గంటలు మాత్రమే ప్రసారాలు నడిచేవి. 1959 సెప్టెంబర్ 15 వ తేదీన దూరదర్శన్ ఏర్పడింది. ఇది ఢిల్లీలో ఏర్పాటైంది. ప్రసారాలు చేసేందుకు సొంతగా ఉపగ్రహాలు లేకపోవడం వల్ల భారతదేశం అమెరికా అంతరిక్ష సంస్థ ఐన నాసా సాయంతో ప్రసారాలు చేసేది. 1979 లో భారతదేశం తొలి ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీనితో సొంతగా టీవి ప్రసారాలు చేయగల సామర్ధ్యం సాధించింది. సాంకేతిక విషయాలు . ఆల్ ఇండియా రేడియోలో(AIR )

భాగంగా 1965లో రోజువారీ ప్రసారాలు తరువాత ముంబై, అమృత్సర్ కి విస్తరించారు.

పరిణామ క్రమం మార్చు

తొలిరోజుల్లో విజ్ఞానాత్మక, విద్యావిషయిక కార్యక్రమాలు మాత్రమే ప్రసార౦ అయ్యేవి. అవి కూడా నలుపు-తెలుపులలో మాత్రమే.

• 1980తర్వాత దేశ౦లోకి కలర్ టెలివిజన్ల ప్రసారాలు ప్రార౦భ౦ అయ్యాయి. కార్యక్రమాలలో నాణ్యత పెరిగి౦ది.

• 1982-85 మధ్య కాల౦లో అన్ని ప్రా౦తీయ భాషల్లోనూ దూరదర్శన్ ఆధ్వర్య౦లో ప్రసారాలు మొదలయ్యాయి.

• శాటిలైట్ టెలివిజన్ ఫర్ ది ఆసియా రీజన్ నెట్వర్కు(STAR) ద్వారా అనేక అ౦శాలలో టి.వి. ఛానళ్ళు పనిచేయడ౦ ప్రార౦భి౦చాయి. సమాజ౦లోని అన్ని వర్గాల ప్రజల అభిరుచులకు తగిన కార్యక్రమాలతో ఛానళ్ళు ప్రసారాలను ప్రార౦భి౦చాయి.

• స్టార్ నెట్వర్క్ తరువాత చెప్పుకోదగ్గ స్థాన౦ జీ-నెట్వర్కుది. ఇది ప్రా౦తీయ భాషలలో ఛానళ్ళను ప్రార౦భి౦చి౦ది.

• దక్షిణాదిలో ఇటువ౦టి కార్యక్రమాలు సన్ నెట్వర్కుతో ప్రార౦భ౦ అయ్యాయి. ఈ స౦స్థ తమిళ భాషలో ఛానళ్ళను మొదలుపెట్టి, తరువాత కన్నడ౦, తెలుగు కార్యక్రమాలను ప్రసార౦ చేయడ౦ ప్రార౦భి౦చి౦ది.

సాంకేతిక పరిజ్ఞానం మార్చు

మొదట ఆంటెనా ద్వారా ప్రసారాలు జరిగేవి. ప్రారంభంలో ఒక పెద్ద ఆంటెనా ఊరికి ఒకటి ఉండేది, క్రమ క్రమంగా ఆంటెనా పరిమాణం చిన్నదౌతూ ఇంటికి ఒకటి ఏర్పరుచుకున్నారు.

పరిణామ క్రమంలో కేబుల్ టీవి ప్రవేశించింది. ఆ తరువాత డి‌టి‌హెచ్ (ఉపగ్రహం) పరిజ్ఞానం వచ్చింది. ఇప్పుడు ఫైబర్ ద్వారా ప్రసారాలు అందుతున్నాయి.

అమజోన్ ఫైర్ స్టిక పరిజ్ఞానం కూడా భారతదేశంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందుతోంది. [1]

భారతదేశంలో టీవి మార్చు

భారతదేశంలోని టీవీ చానల్లు మార్చు

  1. స్టారు టీవీలు
  2. జీ టీవీలు
  3. అల్ఫా టీవీలు
  4. సోనీ టీవీలు
  5. దూరదర్శిని
  6. వివిధ వార్తా చానల్లు

తెలుగు టీవీ చానల్లు మార్చు

  1. దూరదర్శిని
  2. బ్రేకింగ్ న్యూస్ 24x7
  3. వి6 న్యూస్
  4. జెమినీ
  5. ఈ టీవీ
  6. జెమిని మూవిస్
  7. ఈ టీవీ రెండు
  8. టీవీ 9
  9. వీసా టీవీ
  10. మా టీవీ
  11. సిటీ కేబులు
  12. తేజా న్యూసు
  13. ఆదిత్యా మ్యూజికు

మూలాలు మార్చు

  1. Bhargava, Yuthika (2021-02-16). "Amazon to make Fire TV Stick devices in India". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-02-17.
"https://te.wikipedia.org/w/index.php?title=టీవీ&oldid=3849098" నుండి వెలికితీశారు