టోనీ హ్యూస్టన్

అమెరికన్ నటుడు, రచయిత, సహాయ దర్శకుడు

వాల్టర్ ఆంథోనీ హ్యూస్టన్[1][2][3] అమెరికన్ నటుడు, రచయిత, సహాయ దర్శకుడు.[4]

టోనీ హ్యూస్టన్
జననం
వాల్టర్ ఆంథోనీ హ్యూస్టన్

(1950-04-16) 1950 ఏప్రిల్ 16 (వయసు 74)
వృత్తినటుడు, రచయిత, సహాయ దర్శకుడు
జీవిత భాగస్వామి
లేడీ మార్గోట్ చోల్మొండేలీ
(m. 1978, divorced)
పిల్లలు3, జాక్ హ్యూస్టన్
తల్లిదండ్రులుజాన్ హ్యూస్టన్
ఎన్రికా సోమ
బంధువులు

జననం మార్చు

టోనీ హ్యూస్టన్ 1950, ఏప్రిల్ 16న కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీలో దర్శకుడు జాన్ హ్యూస్టన్, నాల్గవ భార్య ఎన్రికా సోమ దంపతులకు జన్మించాడు. ఇతనికి అంజెలికా, అల్లెగ్రా హ్యూస్టన్, డానీ హ్యూస్టన్ అనే తోబుట్టువులు ఉన్నారు.

సినిమారంగం మార్చు

టోనీ హ్యూస్టన్ స్క్రీన్‌ప్లేలు రాయడంలో నైపుణ్యం సాధించాడు. ది హెల్‌క్యాట్స్ (1968), ది డెడ్ (1987) సినిమాలకు ప్రసిద్ధి చెందాడు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

1978, నవంబరు 18న ది 6వ మార్క్వెస్ ఆఫ్ చోల్మోండేలీ కుమార్తె లేడీ మార్గోట్ చోల్మొండేలీతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు మాథ్యూ (జననం 1979), లారా సిబిల్ (జననం 1981), నటుడు జాక్ హస్టన్ (జననం 1982) ఉన్నారు.[5][6][7] హస్టన్, లేడీ మార్గోట్ తర్వాత విడాకులు తీసుకున్నారు.

అవార్డులు మార్చు

అవార్డు విభాగం శీర్షిక ఫలితం మూలాలు
అకాడమీ అవార్డులు ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే ది డెడ్ (1987) నామినేట్
ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డులు ఉత్తమ స్క్రీన్ ప్లే
న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఉత్తమ స్క్రీన్ ప్లే (2వ స్థానం)
యు.ఎస్.సి. స్క్రిప్ట్ అవార్డు

సినిమాలు మార్చు

  • ది లిస్ట్ ఆఫ్ అడ్రియన్ మెసెంజర్ (1963) (డెరెక్ బ్రుటెన్‌హోమ్)
  • ది ఐ క్రీచర్స్ (1967) (కల్వర్స్ సార్జెంట్)
  • జోంటార్, ది థింగ్ ఫ్రమ్ వీనస్ (1967) (కీత్ రిచీ)
  • సామ్
  • కర్స్ ఆఫ్ ది స్వాంప్ క్రీచర్ (1968) (టామ్)
  • మార్స్ నీడ్స్ ఉమెన్ (1968) (మార్టిన్ #3)
  • కోమంచె క్రాసింగ్ (1968)
  • ఆపిల్స్ వే (1974)
  • ది రన్‌అవేస్ (1975)
  • ది డెడ్ (1987) (స్క్రీన్ రైటర్; అకాడమీ అవార్డుకు నామినేట్ చేయబడ్డాడు)

మూలాలు మార్చు

  1. John Huston, Maker of Magic, Stuart M. Kaminsky, Houghton Mifflin, 1978, p. 216.
  2. The American Film Institute Catalog of Motion Pictures Produced in the United States: Feature Films 1961-1970, American Film Institute, University of California Press, 1997, p. 306.
  3. The New Yorker, vol. 48, issue 19, 1972, p. 24.
  4. Smith, Adam (2016-08-30). "How can you connect The Addams Family to Ben-Hur?". The Telegraph. Retrieved 2023-06-08.
  5. Environmental Film Festival.
  6. CHAMPLIN, CHARLES (1987-12-17). "Tony Huston Recalls the Joys of 'The Dead'". Los Angeles Times. Retrieved 2023-06-08.
  7. MacKillop, James (1999). Contemporary Irish Cinema: From The Quiet Man to Dancing at Lughnasa (in ఇంగ్లీష్). Syracuse University Press. ISBN 9780815605683.

బయటి లింకులు మార్చు