తంగిరాల సౌమ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014లో నందిగామ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.

తంగిరాల సౌమ్య
మాజీ ఎమ్మెల్యే
In office
2014–2019
అంతకు ముందు వారుతంగిరాల ప్రభాకరరావు
తరువాత వారుడాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు
నియోజకవర్గం నందిగామ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జాతీయత భారతదేశం
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ

జననం, విద్యాభాస్యం మార్చు

తంగిరాల సౌమ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా , నందిగామలో జన్మించింది. ఆమె విజయవాడలో శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ , ఏలూరు లోని సీఆర్ రెడ్డి కాలేజీలో బిటెక్ పూర్తి చేసింది.

రాజకీయ జీవితం మార్చు

తంగిరాల సౌమ్య ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుమార్తె. తంగిరాల ప్రభాకర్ రావు 2014 సార్వత్రిక ఎన్నికల్లో నందిగామ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన ఆకస్మిక మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. తంగిరాల సౌమ్య 2014లో నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబురావు పై 74,827 ఓట్ల మెజారిటీతో 16 సెప్టెంబర్ 2014న ఎమ్మెల్యేగా గెలిచింది.[1] ఆమె నందిగామ నియోజకవర్గ తొలి మహిళ శాసనసభ్యురాలుగా గెలిచి రికార్డు సృష్టించింది.[2] ఆమె 18 సెప్టెంబర్ 2014న ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసింది.[3]

తంగిరాల సౌమ్య 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు పై 10881 ఓట్ల తేడాతో ఓడిపోయింది.

మూలాలు మార్చు

  1. PTI (25 November 2017). "AP by-poll: Ruling TDP wins Nandigama seat" (in ఇంగ్లీష్). Archived from the original on 4 September 2021. Retrieved 4 September 2021.
  2. Sakshi (17 September 2014). "నాన్న మంచితనమే గెలిపించింది". Archived from the original on 4 September 2021. Retrieved 4 September 2021.
  3. Sakshi (17 September 2014). "ఎమ్మెల్యేగా సౌమ్య ప్రమాణ స్వీకారం". Archived from the original on 4 September 2021. Retrieved 4 September 2021.